India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో మంగళవారం ‘కవచ్’ లోకోను DRM లలిత్ బొహ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాదాలను నివారించడానికి స్వదేశీ పరిజ్ఞానంతో
‘కవచ్’ వ్యవస్థ రూపొందించినట్లు పేర్కొన్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీ కొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.
పెదగంట్యాడలో బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు న్యూపోర్ట్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న బాలిక (13) ఇంటి నుంచి వెళ్లిపోతూ చీటీ రాసింది. అందులో ‘నన్ను వెతకొద్దు, మమ్మీ నాకు చచ్చిపోవాలని ఉంది. ఇన్ని రోజులు చాలా భరించాను. ఇప్పుడు నేను ఇంక దీన్ని భరించలేను. సారీ, గుడ్ బై, నేను ఇంకా బ్రతకను’ అని రాసి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాందుడుకి విశాఖ స్పెషల్ పోక్సోకోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. 2024లో భీమిలి మండలానికి చెందిన సరగడ సన్యాసిరావు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నేరం రుజువుకావడంతో కోర్టు పై విధంగా శిక్ష విధించింది. బాధిత బాలికకు రూ.3 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కి హాజరవుతారు. మధ్యాహ్నం 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.
GVMC పరిధిలో రూ.1015 కోట్ల అభివృద్ధి పనులకు అక్టోబరులోగా టెండర్లు పిలవాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆదేశించారు. అమరావతిలో మంగళవారం జీవీఎంసీ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలన్నారు.మూడునాలుగేళ్లలో ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా జోన్ల పునర్వ్యవస్థీకరణ ఉండాలని సూచించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అధికారులు పాల్గొన్నారు.
C.M.చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైంది. 29న సీఎం విశాఖ రానున్నారు. ఉదయం 11.15కి విశాఖ నావెల్ కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు. 11.45 నుంచి 12.45 వరకు నోవాటెల్‌లో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌కి హాజరవుతారు. 1.15 నుంచి 3.45 వరకు రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో గ్రిఫిన్ ఫౌండేషన్ నెట్ వర్క్ మీటింగ్లో పాల్గొంటారు. సా. 4.20కి విశాఖ నుంచి బయలుదేరి వెళ్తారు.
మెగా డీఎస్సీ 2025లో మరడాన శ్రావణి 86 మార్కులతో(ఎస్ఏ) విశాఖ జిల్లా టాపర్‌గా నిలిచింది. జోన్-1మోడల్ స్కూల్ టీజీటీ ఇంగ్లీష్ 78 మార్కులతో 15వ ర్యాంకు సాధించి రెండు పోస్టులకు ఎంపికయింది. ఈమె ప్రాథమిక, ఉన్నత విద్య శ్రీహరిపురం, కళాశాల విద్య గాజువాకలోను అభ్యసించింది. గతంలో గ్రామ సచివాలయం ఉద్యోగం వచ్చినా వదులుకొని డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించింది.
పార్టీ పట్ల అంకితభావం ఉన్నవారిని పార్టీ పదవులకు ఎంపిక చేస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు. మంగళవారం విశాఖలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ అధ్యక్షుల ఎంపిక జరుగుతుందన్నారు. వైఎస్ విజయమ్మను వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించేందుకు ప్లీనరీ పెట్టుకున్నారని విమర్శించారు. T.D.P.లో అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని పార్టీ పదవులకు ఎంపిక చేస్తామన్నారు.
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు జీవీఎంసీ సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ ద్వారా 1097 మంది నిర్వాహకులకు అనుమతులను మంజూరు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం తెలిపారు. జీవీఎంసీకి సంబంధించిన పట్టణ ప్రణాళిక, అగ్నిమాపక, ఎలక్ట్రికల్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. అందరూ వినాయక చవితి పర్యావరణహితంగా జరుపుకోవాలని కమిషనర్ సూచించారు.
సమస్యలతో బాధపడే మహిళలకు అధికార యంత్రాంగం అండగా ఉండాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ కోరారు. జడ్పీ సమావేశ మందిరంలో ఆమె మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. 54 మంది మహిళలు తమ సమస్యలను వివరించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు న్యాయపరమైన సేవలు అందించాలన్నారు. భరణం వచ్చేలా చూడాలని, స్వయం ఉపాధి కోసం సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.