India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింహాచలం సింహాద్రి అప్పన్నను శుక్రవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆమెకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సింహాద్రి అప్పన్న చల్లని ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం నందమూరి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పాశర్ల తరుణ్ ఆదిత్య, అభిమానులు పాల్గొన్నారు.
ఓ పత్రికపై పరువు నష్టందావా కేసుకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. తప్పుడు కథనాలు ప్రచురించిన పత్రికపై మంత్రి లోకేశ్ రూ. 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడంపై కేసు దాఖలు చేసినట్లు లోకేశ్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 29న తొలిసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయినట్లు లోకేశ్ తరపు లాయర్లు తెలిపారు.
విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఆయన అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయన పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 2013లో రిక్రూట్ చేసిన ఆర్టీసీ డ్రైవర్లను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ ఆర్టీసీ డ్రైవర్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు.
మధురవాడ సమీపంలోని కొమ్మాదిలో కాలనీలో నివాసం ఉంటున్న ఇద్దరు బాలురు ఓ చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. సమాచారం తెలుసుకున్న పీఎం పాలెం పోలీసులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు. కేసును ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కి అప్పగించి దర్యాప్తు చేపట్టారు. బుధవారం రాత్రి చిన్నారి తల్లిదండ్రులు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖ జిల్లాలోని రైతుబజార్లలో సన్‌ఫ్లవర్, పామ్ ఆయిల్ నూనెలను నిర్దేశించిన ధరలకే విక్రయించాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.124, పామాయిల్ రూ.110కి మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు. ఒక కార్డుపై నెలకు 3 ప్యాకెట్ల పామాయిల్, ఒక ప్యాకెట్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందజేయాలన్నారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా 0891-2590100 కు సంప్రదించాలన్నారు.
ఎండాడలోని హైగ్రీవ భూముల వివాదంలో పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనతోపాటు చార్టెడ్ అకౌంటెంట్ జి.వెంకటేశ్వరరావు, బిల్డర్ బ్రహ్మాజీలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని కోర్టు గురువారం ఆదేశించింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వీరు హైకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం రాత్రి విశాఖ నగరానికి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ పశ్చిమ శాసనసభ్యుడు గణబాబు ఇతర పార్టీ నాయకులు లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. అక్కడి నుంచి లోకేశ్ టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య నియామకాలను పునరుద్ధరించాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజ రాణి కోరారు. ఈమేరకు గురువారం విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇదివరకు మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు కారుణ్య ఉద్యోగాల నియామకాలను చేపట్టాలని కోరారు. ఈమేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
జాతీయ యువజనోత్సవాలు ప్రజాతంత్ర-2024కు ఏపీ నుంచి ఏయూకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.శశిభూషణరావు గురువారం తన కార్యాలయంలో అభినందించారు. నవంబర్ 16 నుంచి 18 వరకు లక్నోలో జరిగే ఈ యువజన ఉత్సవాలలో విద్యార్థినులు ఎం.శివాని లహరి, డి.హర్షిత పాల్గొంటారు. వీరు ఇరువురు రాష్ట్రం తరఫున అక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న MHRM రెండో సెమిస్టర్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో నిర్వహిస్తున్న MBA నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల వివరాలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.