India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ పోర్ట్ ట్రస్ట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. విశాఖ పోర్ట్ ట్రస్ట్ అథారిటీ అవసరాలకు 60 టన్నుల సామర్థ్యం గల బొలార్ట్ పుల్ టగ్ నిర్మించే బాధ్యతను హెచ్పీసీఎల్‌కు అప్పగించింది. హెచ్పీసీఎల్ తరఫున డైరెక్టర్ గిరిదీప్ సింగ్, పోర్టు తరఫున డిప్యూటీ కన్జర్వేటర్ కెప్టెన్ టి.శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 18 నెలల్లో పెగ్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది.
పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కొమ్మాదిలో బుధవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. మృతుడు బేవర.సాయి కుమార్ రేవల్లపాలెం నివాసితునిగా గుర్తించారు. ఒక వివాహనికి విద్యుత్ సంబందిత పని చేస్తుండగా పిడుగు పడటంతో విద్యుత్ ప్రమాదం జరిగింది. వెంటనే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టాలు పంపిణీ చేసినట్లు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలిపారు. వీరందరికి యాజమాన్యం హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు పొందిన వారికి రెండేళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. యాజమాన్య హక్కు లేకపోవడంతో నిర్మాణాలు జరగలేదన్నారు.
భోగాపురం విమానాశ్రయం ప్రగతిపై విశాఖ ఎంపీ శ్రీభరత్ జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ ప్రస్తుత పనులు, డిజైన్, భవిష్యత్తు ప్రణాళిక వంటి అంశాలపై ఎంపీ చర్చించి పలు సూచనలు చేశారు. రాబోయే 50 ఏళ్ల వరకు ఎటువంటి అవాంతరాలు రాకుండా తీరప్రాంత వాతావరణ పరిస్థితులకు తగ్గ మెటీరియల్ వాడాలన్నారు. విమానాశ్రయం పనులు 45 శాతం పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా ఎంపీకి తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈనెల 17వ తేదీన విశాఖ వస్తున్నారు. రాత్రి 10:00 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం 10:30 గంటలకు జిల్లా కోర్టుకు వెళతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కోర్టు నుంచి ఎన్టీఆర్ భవన్ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదల చేశారు.
పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్‌లో ప్రవేశాలకు ఏయూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏడాదికి ఫీజుగా రూ.30 వేల చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు AU వెబ్సైట్ నుంచి పొందవచ్చు. MA, MSC సైకాలజీ, MBBS, BA, BSC సైకాలజీ, MSC సోషల్ వర్క్, BSC నర్సింగ్ కోర్సులు చేసిన వాళ్లు దీనికి అర్హులు.
కసింకోట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కసింకోట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మృతులు నక్కపల్లి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈనెల 17వ తేదీన నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం విశాఖ వస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రాత్రి 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నగరానికి వెళ్లి బస చేస్తారు. 18వ తేదీన సీఈవో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 11.10 గంటలకు తిరిగి ఢిల్లీ వెళతారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుతో కలిసి కోట నుంచి సిరిమానును ఆయన తిలకించారు. వారితో పాటు రాజ కుటుంబీకులు, జిల్లా ప్రజాప్రతినిదులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నరవ సమీపంలోని మన్యం కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతండ్రిని కడతేర్చాడు. దసరా నుంచి మద్యం సేవిస్తూ గొడవ పడుతున్న గోపి.. తండ్రి దేముడును మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో పీక కోసేశాడు. సంఘటన స్థలములోనే దేముడు మృతి చెందగా.. స్థానికుల ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు ఘటనాస్థలంలో గోపిని అదుపులో తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.