Visakhapatnam

News October 11, 2024

మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే గంటా

image

విశాఖపట్నంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ రావడానికి మంత్రి లోకేశ్ కృషి చేశారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన్ను కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ కంపెనీ ద్వారా పదివేల మందికి ఉపాధి అవకాశం దొరుకుతుందని, విద్యా, ఫార్మా, టూరిజం వంటి అభివృద్ధి చెందుతాయన్నారు. నగరంలో మెట్రో ఏర్పడే సమయాని ఫ్లైఓవర్లు, కారిడార్లు వంటి వాటిపై దృష్టి సారించాలని మంత్రిని గంటా కోరారు.

News October 11, 2024

అప్పుడే విశాఖ ఉక్కుకు మంచి రోజులు: గుడివాడ

image

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని అల్టిమేటం ఇవ్వాలని కోరారు. అప్పుడే విశాఖ ఉక్కుకు మంచి రోజులు వస్తాయని అన్నారు.

News October 11, 2024

భీమిలిలో మానసిక రోగిపై అత్యాచారం..!

image

భీమిలికి చెందిన ఓ మానసిక రోగిపై ఈనెల 3న అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు లేని సమయంలో మతిస్థిమితం లేని అమ్మాయిని ఓ యువకుడు స్కూటీపై గొట్లాం తీసుకువెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. స్కూటీని ఆమెను స్థానికులు గమనించి విజయనగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు భీమిలి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

News October 11, 2024

విశాఖ: ‘విన్యాసాలతో బంధం బలోపేతం’

image

ఇండో పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్యం, భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖ నౌకాదళ అధికారులు పేర్కొన్నారు. విశాఖ తీరంలో నిర్వహిస్తున్న మలబార్-2024 విన్యాసాల్లో వివిధ అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ విన్యాసాలతో ఆయా దేశాల మధ్య బంధం బలోపేతం అవుతుందని వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ తెలిపారు.

News October 11, 2024

విద్యుత్ కాంతుల వెలుగులో శంఖు, చక్ర నామాలు

image

వరహా లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం సింహగిరిపై (సింహాచలం) స్వామి వారి శంఖు, చక్ర, నామాలు విద్యుత్ దీప కాంతులతో వెలుగొందుతున్నాయి. దాతల సహాకారంతో నిర్మించిన చేపట్టగా శంఖు, చక్ర, నామాలు ఎట్టకేలకు గురువారం ప్రారంభించారు. విద్యుత్ దీప కాంతులతో అద్భుతంగా దర్శనమిస్తున్న తిలకిస్తున్న భక్తులు ఆనందంతో పులకించి పోతున్నారు.

News October 11, 2024

విశాఖ నుంచి విజయవాడకు కొత్త విమాన సర్వీసులు

image

ఈనెల 27 నుంచి విశాఖ-విజయవాడ-విశాఖకు రెండు కొత్త విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థ ప్రారంభించనుంది. 29న విజయవాడ నుంచి విశాఖకు ఇదే సంస్థ మరో సర్వీస్ ప్రారంభించనుంది. ఇందులో ఓ సర్వీసు వారం రోజులు అందుబాటులో ఉంటుంది. ఇది విజయవాడ నుంచి విశాఖకు ఉదయం 10:35 గంటలకు వచ్చి తిరిగి మధ్యాహ్నం బయలుదేరుతుంది.

News October 11, 2024

కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ శ్రీ భరత్

image

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో ఉన్న కనకమహాలక్ష్మి ఆలయాన్ని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

News October 11, 2024

విశాఖలో ప్రీమియర్ షో చూసిన హీరో సుధీర్ బాబు

image

హీరో సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో ‘ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీమియర్ షోను గురువారం ద్వారకానగర్‌లోని సంఘం థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. సినిమా ఇద్దరు ఫాదర్స్, ఒక కొడుకు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఆయన వెల్లడించారు.

News October 10, 2024

తాతయ్యబాబుకి గృహ నిర్మాణ మంత్రి అభినందనలు

image

ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం విజయవాడలో బాధ్యతలు చేపట్టిన తాతయ్య బాబును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి అభినందించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయనకు మంత్రి సూచించారు. పేదలందరికి పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

News October 10, 2024

మిల్లెట్స్‌తో రతన్ టాటా చిత్రపటం

image

దాతృత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ, భారతదేశానికి, పారిశ్రామిక రంగానికి పేరు ప్రఖ్యాతి తెచ్చిన మహోన్నత వ్యక్తికి విశాఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. మిలెట్స్ ఉపయోగించి రతన్ టాటా చిత్రాన్ని తయారు చేశారు. ఆ మహనీయునికి తాను ఇచ్చే నివాళి ఇది అని విజయ్ కుమార్ అన్నారు.