Visakhapatnam

News February 8, 2026

విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ సీఎండీ

image

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

News February 7, 2026

విశాఖకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

image

విశాఖ ఐటీ హిల్స్‌కు వెళ్లే ఉద్యోగుల కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం మద్దిలపాలెం డిపోలో అదనంగా రెండు ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. అలాగే జిల్లాకు 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ పథకం అమలులో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఉత్తమ సేవలు అందించిన ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశామన్నారు.

News February 7, 2026

మాతృ మరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

image

విశాఖ కలెక్టర్ హరీంధిర ప్రసాద్ మాతృ మరణాలపై శనివారం సమావేశం నిర్వహించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో భవాని గార్డెన్స్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, నక్కవానిపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రం, గాజువాక పరిదిలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని DMHO జగదీశ్వర రావు వివరించారు. మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలని, హైరిస్క్ గర్భిణీలు ప్రసవానికి వచ్చినప్పుడు కేజీహెచ్‌కి గానీ VGHకు గానీ రిఫర్ చేయాలని కలెక్టర్ సూచించారు.

News February 7, 2026

విశాఖలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటన

image

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ శనివారం రాత్రి 8 గంటలకు విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆశిల్ మెట్ట జంక్షన్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించనున్న బడ్జెట్ ప్రచార అభియాన్-2026 కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని, సాయంత్రం 4.40 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

News February 7, 2026

షీలానగర్‌ జంక్షన్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

షీలానగర్ జంక్షన్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ప్రాంతానికి చెందిన వసుధ, శ్రీనివాసు దంపతులు తమ ఆరేళ్ల కుమారుడితో కలిసి స్కూటీపై అనకాపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో షీలానగర్ జంక్షన్ సమీపంలో ఓ భారీ లారీ వీరి బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వసుధ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసు, ఆరేళ్ల బాలుడు గాయపడ్డారు.

News February 7, 2026

‘గీతం భూముల వ్యవహారంలో బాధ్యులపై చర్యలకు డిమాండ్’

image

వైసీసీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి, విశాఖ మాజీ మేయర్ గొలగాని హరికుమారి తాడేపల్లిలో మాట్లాడుతూ గీతం సంస్థల ఆధీనంలోని 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్‌ను జీవీఎంసీ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని ఆరోపించారు. ఈ నిర్ణయంపై బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు.

News February 7, 2026

విశాఖలో నేషనల్ సూపర్ క్రాస్ రేసింగ్.. పార్కింగ్ ఆంక్షలు ఇవే..

image

విశాఖలోని పాత మున్సిపల్ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 వరకు ‘MRF నేషనల్ సూపర్ క్రాస్ ఛాంపియన్‌షిప్’ జరగనుంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ షణ్ముఖరావు పార్కింగ్ సూచనలు జారీ చేశారు. గాజువాక పోర్ట్ రోడ్డులో, పూర్ణా మార్కెట్ వారు జీవీఎంసీ ప్లాంట్ వద్ద వాహనాలు నిలపాలన్నారు. VVIP పాస్ ఉన్నవారు స్టేడియంలో పార్కింగ్ చేయాలని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.