Visakhapatnam

News October 9, 2024

నేడు మన నితీశ్ కుమార్ రెడ్డి సిక్సర్లతో చెలరేగుతారా..!

image

ఇండియా- బంగ్లాదేశ్ మధ్య బుధవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొన్న జరిగిన తన అరంగేట్ర టీ20లో మన విశాఖ ప్లేయర్ నితీశ్ రెడ్డి బౌలింగ్, బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేయడంతో పాటు, బ్యాటింగ్ సమయంలో ఓ భారీ సిక్సర్‌తో 16 రన్స్ చేశాడు. నేడు బంగ్లాతో రెండో టీ20లో సిక్సర్లతో చెలరేగడంతో పాటు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News October 9, 2024

విశాఖలో పెరిగిన విమాన ప్రయాణికులు

image

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జులైలో 1,720 విమానాల ద్వారా 2,25,261 మంది.. ఆగస్టులో 1,872 విమానాల్లో 2,52,311 మంది ప్రయాణించినట్లు ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ తెలిపింది. సెప్టెంబరులో 1,806 సర్వీసుల్లో 2,25,215మంది ప్రయాణించినట్లు వివరించింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే 6.8శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.

News October 9, 2024

స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు కేంద్రం హామీ: ఎంపీ శ్రీభరత్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందన్నారు.

News October 9, 2024

ఏసీఏ టోర్నీలో విశాఖ జట్టు విజయం

image

ఏసీఏ అండర్ -14 క్రికెట్ టోర్నీలో విశాఖ జట్టు గెలుపొందింది. కడపలో జరిగిన మ్యాచ్‌లో తూ.గో. జిల్లా జట్టుపై విశాఖ ఘన విజయం సాధించింది. విశాఖ 68 ఓవర్లలో 426/3కి డిక్లేర్ చేయగా.. తూ.గో. జట్టు 50పరుగులకే ఆలౌట్ అయింది. విశాఖ జట్టులో వినోద్ (177), రామ్ చరణ్(133)రన్స్ చేయగా.. ప్రఖ్యాత్ వర్మ 5వికెట్లు తీశారు.

News October 9, 2024

విశాఖ: ప్రయాణికులు భద్రతకు ప్రత్యేక చర్యలు

image

పండగ సీజన్ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ప్రయాణికులు సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక కోచ్‌లు జత చేస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్లు లేకుండా రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించరాదన్నారు. నిషేధిత వస్తువులను తీసుకువెళ్లవద్దన్నారు.

News October 9, 2024

అనకాపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి

image

అనకాపల్లి జిల్లాలో సాగినీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థలో రైతులను భాగస్వామ్యం చేసి సాగునీటి సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News October 9, 2024

విశాఖలో TODAY TOP NEWS

image

✶విశాఖ: విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు
✶పాయకరావుపేటలో అమ్మవారి నవరూప అవతారాలు
✶డిసెంబర్‌లో విశాఖ రైల్వే‌జోన్‌కు శంకుస్థాపన
✶అరకులోయలో NCC కెడెట్స్ ట్రెక్కింగ్ క్యాంపు
✶నక్కపల్లి వద్ద బస్సు ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
✶మేడివాడ: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
✶అల్లూరి: 59 మొబైల్ ఫోన్లు అప్పగింత
✶విశాఖలో రూ.50కే కిలో టమాటా
✶విశాఖలో ఆక్రమణలు కూల్చివేత

News October 8, 2024

అనకాపల్లి: సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి

image

అనకాపల్లి జిల్లాలో సాగినీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థలో రైతులను భాగస్వామ్యం చేసి సాగునీటి సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News October 8, 2024

విశాఖ: స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర మంత్రితో సీఎం చర్చ

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే అంశంపై కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఢిల్లీలో సీఎం అధికార నివాసంలో మంగళవారం కేంద్రమంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు.

News October 8, 2024

విశాఖ‌ జిల్లాలో “ప‌ల్లె పండ‌గ” వారోత్సవాల‌కు ప్ర‌ణాళిక సిద్ధం

image

విశాఖ‌ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వ‌ర‌కు “ప‌ల్లె పండ‌గ” వారోత్స‌వాల‌ను ప్ర‌ణాళికాయుతంగా నిర్వ‌హించేందుకు ప‌టిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన సమీక్ష కలెక్టర్ మాట్లాడారు. రూ.29 కోట్ల అంచ‌నా వ్య‌యంతో గ్రామీణ ప‌రిధిలో 322 ప‌నుల‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించామన్నారు.