Visakhapatnam

News August 11, 2025

స్టీల్ ప్లాంట్‌లో విషాదం.. ఒకే రోజు ఇద్దరు మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విషాదం నెలకొంది. వేరువేరు విభాగాల్లో పనిచేస్తోన్న ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం మృతి చెందారు. సీపీపీ విభాగంలో రోజువారి కూలీగా పనిచేస్తున్న తాడి అప్పారావు(54) క్లీనింగ్ చేస్తూ కింద పడి మృతి చెందాడు. ఇతను అగనంపూడి ప్రాంతానికి చెందివాడు. ఇస్లాంపేటలో నివాసం ఉంటున్న సురేశ్ సింగ్(45) ఐరన్ స్ర్కాప్ పైకి ఎత్తుతుండగా తీగ తెగి పడి మరణించాడు. మృతుడిది బిహార్‌గా గుర్తించారు.

News August 11, 2025

విశాఖ డెయిరీ కాంట్రాక్ట్ కార్మికుల నిరాహార దీక్ష

image

విశాఖ డెయిరీలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్మికులు 24 గంటల నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. దీక్షా శిబిరంలో మహిళా కార్మికులు రాత్రి విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోతున్నారు. తమ కుటుంబాల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేరేవరకు వెనక్కి తగ్గబోమని కార్మికులు స్పష్టం చేశారు.

News August 11, 2025

విశాఖ కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు

image

విశాఖ కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో నాలుగు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేవారు. కలెక్టర్ పేరు, ఫొటోతో ఈ అకౌంట్లు నడుపుతున్నారు. ఇవి పూర్తిగా నకిలీ అని విశాఖ కలెక్టరేట్ నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ అకౌంట్ నుంచి వచ్చే ఎటువంటి సందేశాలకు ప్రతిస్పందించవద్దని సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. >Share it

News August 11, 2025

విశాఖలో రెవెన్యూ సమస్యలే అధికం

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 313 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 130, జీవీఎంసీకి సంబంధించి 82, పోలీసు విభాగానికి చెందిన‌వి 15 ఉండ‌గా ఇత‌ర విభాగాల‌కు చెందిన ఫిర్యాదులు 86 ఉన్నాయి.

News August 11, 2025

కైలాసగిరిపై ఆసియాలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జ్

image

కైలాసగిరిపై నూతనంగా నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జి అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్ విశ్వనాథన్ వెల్లడించారు. సోమవారం కైలాసగిరిపై నిర్మాణంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి పనులు పరిశీలించారు. ఆసియాలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం కైలాసగిరిపై జరుగుతోందన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

News August 11, 2025

జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 113 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 113 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనరు కేతన్ గార్గ్‌తో కలిసి తీసుకున్నారు. ఇందులో జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 4, రెవెన్యూ 8, ప్రజారోగ్యం 7, పట్టణ ప్రణాళిక 67, ఇంజినీరింగు 22, యుసిడి 5 మొత్తంగా 113 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News August 11, 2025

విశాఖలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విశాఖపట్నం కలెక్టరేట్‌లో సోమవారం (ఆగస్టు 11, 2025) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరించబడతాయి. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News August 10, 2025

సెప్టెంబర్ 14న విశాఖలో ‘నేషనల్ డాగ్ షో’

image

సెప్టెంబర్ 14న విశాఖలో గాదిరాజు ప్యాలెస్‌లో ‘నేషనల్ డాగ్ షో’ నిర్వహించనున్నట్లు విశాఖ కెన్నెల్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆర్ & బి జంక్షన్ వద్ద ఆదివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ డాగ్ షోలో దేశం నలుమూలల నుంచి ఊటి, కోడాయికెనాల్, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కోల్‌కతా, జార్ఖండ్, చత్తీస్‌‌ఘడ్ వంటి వివిధ ప్రదేశాల నుంచి 50 జాతులు, 300 శునకాలు పాల్గొంటాయన్నారు.

News August 10, 2025

గాజువాక సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

గాజువాక సమీపంలో జగ్గు జంక్షన్ కర్నవాణిపాలెం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ట్రాలర్ ఢీకొట్టిన ఘటనలో ఏ.మోహన్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అదే ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.

News August 10, 2025

విశాఖలోని హోటల్స్‌, రెస్టారెంట్లలో తనిఖీలు

image

విశాఖలోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులు గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 44 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.