India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సరిగ్గా 20 నెలల క్రితం మూసివేసిన డాక్ యార్డ్ బ్రిడ్జి పోర్టు యాజమాన్యం సహకారంతో పునర్నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే గణబాబు స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రాకపోకలు చేయవచ్చని తెలిపారు. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు పూర్తి చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. అన్ని రహదారుల పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. భద్రత ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

విశాఖలో ఈనెల 14, 15వ తేదీల్లో భాగస్వామ్య సదస్సు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నగరమంతా సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టవలసిన అంశాలు అడిగి తెలుసుకున్నారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్‌ల వద్ద వేలాదిమంది భక్తులు సముద్ర స్నానం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీఐజీ గోపినాథ్ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజల సహకారంతో పాటు రెవెన్యూ, మత్స్య, వైద్య, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.

శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వైద్య సిబ్బందికి తెలియజేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బుధవారం విజ్ఞప్తి చేశారు. విశాఖలో నవంబర్ 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమం (LCDC) పటిష్టంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని, ప్రాథమిక దశలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు అన్నారు.

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో డీసీపీ-1గా మణికంఠ చందోల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ కాగా తిరిగి ఆయనకే డీసీపీగా పోస్టింగ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయనకు పలు కార్యక్రమాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంలోనూ సఫలీకృతమైన అనుభవం, పరిపాలన పరంగా మంచి నైపుణ్యం ఉంది.

భారతదేశ జనాభా గణన – 2027లో నమోదయ్యేందుకు ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర జన గణన డైరెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన భీమిలి మండలం ప్రజా పరిషత్, జీవీఎంసీ జోనల్ కార్యాలయంలోనూ ఇండ్ల గణన పై PRE -TEST (ముందస్తు పరీక్ష) కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర జన గణన డైరెక్టర్ అధ్యక్షతన జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఎన్యూమ్ రేటర్లకు, సూపర్‌వైజర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సింహాచలం నుంచి బైక్ పై ఆరిలోవ వైపు వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు పై ఉన్న ఇద్దరు యువకులు గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. మృతుడు గురుద్వార్‌కి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు.

విశాఖ వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొనారు. AU ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 40 పైచిలుకు దేశాల నుంచి వందల సంఖ్యలో వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగావకాలు వస్తాయన్నారు.

మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉరి వేసుకొని ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గేదెల ఫణి (18)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడి వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరిరోజు కావడంతో ఎక్కువమంది ఒకేసారి చేరుకున్నారు. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.
Sorry, no posts matched your criteria.