India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలోని ఆన్‌లైన్‌లో జరుగుతున్న వ్యభిచార గుట్టును సైబర్ క్రైమ్ టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. నగర కమిషనర్ ఆదేశాలతో నిఘా పెట్టిన పోలీసులు.. ఏజెంట్ల సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్న రావాడ కామరాజుతో పాటు రమేశ్, సుభద్ర, సూర్యవంశీ, రాములను అరెస్టు చేశారు. 34 మంది ఏజెంట్ల డేటాను భద్రపరిచి అనాధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
ఈనెల 19వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 3.50 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళతారు. సాయంత్రం ఏయూలో నిర్వహించే దివ్య కల మేళాలో ఆయన పాల్గొంటారు. తిరిగి నొవాటెల్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు. 20వ తేదీ సాయంత్రం విమానంలో ఆయన విజయవాడ వెళతారు.
విశాఖ నుంచి దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.
గూడెం కొత్తవీధి మండలంలో మరో విషాదం నెలకొంది. ఆర్వీ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని జంపారంగి.ధార అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు టీడీపీ నేత సత్తిబాబు తెలిపారు. పచ్చకామెర్లతో బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
అల్లం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల మన్యంలో వర్షాలు అధికంగా పడటంతో అల్లం పంట దెబ్బతింది. దీంతో దిగుడులు తగ్గి డిమాండ్ ఏర్పడింది. జూన్, జులై నెలల్లో అల్లం ధర కేజీ రూ.150 ఉండగా ఆ తరువాత కేజీ రూ.120 నుంచి రూ.130కి తగ్గింది. ప్రస్తుతం చింతపల్లిలో కేజీ రూ.200కు విక్రయిస్తున్నారు. త్వరలో కొత్త అల్లం మార్కెట్లోకి వస్తుంది. ఇది వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.
విశాఖ జిల్లాలో రేషన్ డిపోల సంఖ్య 150 నుంచి 200 వరకు పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రాష్ట్రం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో 642 రేషన్ డిపోల పరిధిలో 5.29 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతూ వస్తున్నా డిపోలు మాత్రం పెరగలేదు. ఈనెల 30 నుంచి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
మిలాద్ ఉన్ నబీ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సోమవారం సెలవు ప్రకటించినట్లు ఏయూ రిజిస్ట్రార్ ధనంజయరావు తెలిపారు. సోమవారం ఏయూకు సెలవు లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రతి సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 16వ తారీకు నాడు రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 23వ తేదీన యధావిధిగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆర్జీదారులు కార్యాలయానికి రావద్దని సూచించారు.
సంత్రాగచ్చి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు(07222) ఈరోజు 5 గంటల ఆలస్యంగా ప్రారంభం కానుంది. సంత్రాగచ్చి నుంచి 12:20 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. ఇవాళ సాయంత్రం 05:20 గంటలకు అక్కడ రైలు కదులుతుంది. ఈ ట్రైన్ దువ్వాడ స్టేషన్‌కు సోమవారం ఉదయం 8:20 గంటలకు చేరుతుంది. లింక్ రైలు ఆలస్యంగా నడుస్తున్నందున ఈ అసౌకర్యం కలిగినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన మానసిక వైద్యుడు సతీశ్ కుమార్‌పై పీఎం పాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీతమ్మధారకు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ చిన్న కుమార్తె ప్రతి చిన్న విషయానికి భయపడుతోంది. దీంతో మిధిలాపురి వుడా కాలనీలోని సతీశ్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో బాలికలకు క్లాస్ చెబుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో ఈనెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.