Visakhapatnam

News September 12, 2024

దంతెవాడ వరకే విశాఖ-కిరండూల్ రైళ్లు

image

కేకే లైన్లో బచేలి-కిరండూల్ మధ్య భారీ వర్షాల వలన రైళ్ల గమ్యస్థానం కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. సెప్టెంబరు 12 నుంచి 18 వరకు విశాఖ-కిరండూల్ (18514) నైట్ ఎక్స్ ప్రెస్, విశాఖ-కిరండూల్ (08551) పాసింజర్ రైలు దంతెవాడ వరకు నడుస్తాయన్నారు. అలాగే కిరండూల్-విశాఖ(18513) నైట్ ఎక్స్ ప్రెస్, కిరండూల్-విశాఖ (08552) పాసింజర్ సెప్టెంబరు 13 నుండి 19 వరకు దంతెవాడ నుంచి బయలుదేరుతాయన్నారు.

News September 12, 2024

విశాఖ: సీజనల్ వ్యాధులపై ఇంటింటి సర్వే

image

ఇటీవల విస్తారంగా కూర్చుని నేపథ్యంలో జిల్లాలో వ్యాధులపై ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్యం అందజేయాలని ఆయన సూచించారు. జిల్లాలో 420 డెంగ్యూ కేసులు నమోదయినట్లు తెలిపారు.

News September 11, 2024

తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

ఈస్ట్ కోస్ట్ డివిజన్‌లోని పలు ప్రత్యేక రైళ్లును రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.

News September 11, 2024

విశాఖ: సెప్టెంబ‌ర్ 14న జాతీయ లోక్ అదాల‌త్

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆల‌పాటి గిరిధ‌ర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మ‌డి విశాఖపట్నం జిల్లా ప‌రిధిలోని అన్ని న్యాయ స్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.

News September 11, 2024

విశాఖ రేంజ్ పరిధిలో 13 మంది ఎస్సైలు బదిలీ

image

విశాఖ రేంజ్ పరిధిలో 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. మాకవరపాలెం ఎస్సై టీ.రామకృష్ణారావును రోలుగుంట పోలీసు స్టేషన్‌కు, కే.కోటపాడు ఎస్సై లక్ష్మీనారాయణను ఏ.కోడూరు, రావికమతం ఎస్సై ధనుంజయ్ నాయుడును అనకాపల్లి వీఆర్‌కు, ఏ.కోడూరు ఎస్సై రమేశ్‌ను అనకాపల్లి వీఆర్‌కు, కొత్తకోట ఎస్సై లక్ష్మణరావును కశింకోటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 11, 2024

విశాఖలో బాలికపై అత్యాచారం..!

image

విశాఖలో మంగళవారం రాత్రి దారుణఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ గోపాలపట్నంలోని ఓ బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌‌కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 11, 2024

విశాఖలో వ్యభిచార గృహంపై దాడి

image

విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. మధురానగర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో నిర్వాహకురాలితో పాటు ఒక బాధితురాలు విటుడు ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.

News September 11, 2024

తెరుచుకున్న బొర్రా గుహలు

image

భారీ వర్షాల వల్ల అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసివేసిన బొర్రా గుహలను అధికారులు మంగళవారం తెరిచారు. అయితే మంగళవారం కేవలం 300 మంది పర్యాటకులు మాత్రమే బొర్రా గుహలను సందర్శించారని యూనిట్ మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు.

News September 11, 2024

విశాఖ-అరకులోయ బస్సుల పునరుద్ధరణ

image

భారీ వర్షాల కారణంగా విశాఖ నుంచి అరకులోయ రాకపోకలు సాగించే మూడు బస్సులను గత శనివారం నుంచి నాలుగు రోజుల పాటు రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో బుధవారం నుంచి ఈ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి మాడుగుల, పాడేరు వెళ్లాల్సిన సర్వీసులను చోడవరం వరకు మాత్రమే నడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా చోడవరం నుంచి మాడుగుల, పాడేరు రూట్లు బాగా పాడయ్యాయి.

News September 11, 2024

విశాఖలో రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ

image

సీతమ్మధార రైతు బజార్ సమీపంలో గల ఆక్సిజన్ టవర్స్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినాయకుని ప్రసాదమైన 50 కిలోల లడ్డూ వేలంపాటలో రూ.4.50 లక్షలు పలికింది. స్థానికురాలు హర్ష పల్లవి లడ్డూను వేలంలో దక్కించుకుని.. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆక్సిజన్ టవర్స్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.