India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి మృతిపై మంత్రి సవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఏడో తరగతి చదువుతున్న కొణతాల శ్యామలరావు బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాత కళ్లు తిరుగుతున్నాయని తోటి విద్యార్థులకు తెలిపి అపస్మారకస్థితిలోకి వెళ్లి ఆకస్మికంగా మృతి చెందాడు. శ్యామలరావు మృతికి కారణాలు తెలపాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో విజయనగరం పరిధిలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ముసుగులు తొడిగారు. కమిషనర్ పి.నల్లనయ్య ఆదేశాలతో ప్రణాళిక అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగినట్లు కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు.
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనేదానిపై జిల్లాలో ప్రస్తుతం చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున గొంప కృష్ణ, కిమిడి నాగార్జున పేర్లు వినిపిస్తుండగా.. వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాస్, బెల్లాన చంద్రశేఖర్ పేర్లు వినిపిస్తున్నాయి.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీ గుర్తులతో గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో MPTC 549, ZPTC 34, కార్పొరేటర్లు 50, కౌన్సిలర్లు 110, MLA 9, MLC ఒకరు చొప్పున మొత్తం 753 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కాగా వీటిలో మొత్తం 22 ఖాళీలు ఏర్పడ్డాయి. మెజారిటీ సభ్యులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు.
విజయనగరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇందుకూరి రఘురాజు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రఘురాజు గతంలోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ డిగ్రీ మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్, మూడో సెమిస్టర్, 4వ సెమిస్టర్, 5వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షల విభాగం అధికారులు పేర్కొన్నారు. జూన్ నెలలో జరిగిన ఈ పరీక్షలకు రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ మార్కుల వివరాలను AU వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఇందుకూరి రఘురాజు ఎన్నికయ్యారు. సొంత పార్టీలో పొసగలేని రఘురాజు.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు అప్పటిలో వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల ముందు రఘురాజు సతీమణి సుధారాణి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక సంస్థల MLC స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో, జిల్లాలో శనివారం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయరాదన్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించడం లేదని దీన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. దూరప్రాంతాల నుంచి అనవసరంగా వ్యయ ప్రయాసలకు ఓర్చి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో నైపుణ్య గణన 2024ను పక్కాగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నైపుణ్య గణన 2024పై ఎంపిడిఓలతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 15 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సుగల వారి పూర్తి వివరాలను నైపుణ్య గణనలో నమోదుచేయించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.