India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరంలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా అల్లు పద్మజని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మజ పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా ఉన్న అప్పలనాయుడును ప్రిన్సిపాల్‌గా శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యా సంస్థల్లో ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాడని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులను బుధవారం ఆదేశించారు. ర్యాగింగ్ వలన కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించి, అవగాహన కల్పించాలని సూచించారు. తమ పరిధిలోగల ఇంజినీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలను, ఇతర విద్యాలయాలను సందర్శించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
2025 డీఎస్సీ పరీక్ష రాసి అర్హత సాధించిన ఉపాద్యాయుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ బి.విజయభాస్కర్ అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో DSCకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు రీ వేర్ఫికెషన్ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు ఎటువంటి అపోహలు పడొద్దని, అభ్యంతరాలుంటే DEOని సంప్రదించాలన్నారు.
విజయనగరం జిల్లాలో ఎరువులకు కొరత లేదని, ప్రస్తుత పంటలకు అవసరమైనంత ఎరువుని ఇప్పటికే సరఫరా చేశామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, SPలతో CM చంద్రబాబు బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా.. జిల్లా పరిస్థితులను కలెక్టర్ వివరించారు. ఇప్పటికే సుమారు 30వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామని, ఇంకా 37,600 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమన్నారు.
రైతు సమస్యలపై రెవెన్యూ డివిజన్ల స్థాయిలో ఈనెల 9న రైతు నిరసన కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో నిర్వహించ తలపెట్టినట్టు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను) పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందని రైతులు చెబుతుంటే కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ పాఠశాలలో డ్రైవింగ్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. కనీసం ఏడాది కాలపరిమితి గల లైట్ డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్‌తో ఈనెల 5వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమర్జన వేడుకల్లో ఎటువంటి అపశృతులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డిజేలను వినియోగించేందుకు అనుమతులు లేవన్నారు.
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో NDPS చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులను ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫెరెన్స్‌లో సమీక్షించారు. పెండింగులో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. పరారీలో ఉన్న నిందితుల సమాచారం సేకరించాలని, వారి ఆచూకీని గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని సూచించారు.
జిల్లాలో భూగర్భ జలాల స్థాయిలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో భూగర్భ జలాల స్థాయిలపై చర్చించారు. జిల్లాలో 3 మీటర్ల లోపల 17 మండలాల్లో, 3 నుంచి 8 మీటర్ల లోపల 9 మండలాల్లో, 8 మీటర్ల లోతులో 2 మండలాల్లో భూ గర్భ జలాల స్థాయిలు ఉన్నాయని, రాష్ట్రంలో బాపట్ల సరాసరి 3.7 మీటర్ల లోతులో ఉంటూ మొదటి స్థానంలో ఉందన్నారు. విజయనగరం 2వ స్థానంలో ఉందని వెల్లడించారు.
అర్జీదారులు తమ సమస్యలు, బాధలు తీరుతాయనే పీజీఆర్ఎస్‌కు వస్తారని, వాటిని అర్ధం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించడమే నిజమైన సేవ అని కలెక్టర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. మంగళవారం విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారులతో ఆర్జీల పరిష్కారం పై కలెక్టర్ సమీక్షించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్జీల పరిష్కారం చేయడం ద్వారా ఒకరి సమస్య తీర్చడమే నిజమైన సేవగా భావించాలన్నారు.
Sorry, no posts matched your criteria.