India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నవంబర్ 3న జరగాల్సిన స్క్రీనింగ్ పరీక్షను నవంబర్ 10న నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఉప సంచాలకులు బి.రామనందం శుక్రవారం తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ నమోదు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి 3 నెలల పాటు ఉచిత భోజన, వసతులు కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
KGBVలో టీచింగ్, నాన్-టీచింగ్ (అకౌంటెంట్, వార్డెన్) పోస్టుల్లో అన్ని కేటగిరీలకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను తయారు చేసినట్లు జిల్లా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. Vizianagaram.ap.gov.in వెబ్సైట్‌లో ఈ మెరిట్ లిస్ట్‌ను పొందుపరిచామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సమగ్ర శిక్షణా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
నవంబర్ 2న విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం ఉ.11:10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో గంగచోళ్లపెంటలో ల్యాండ్ అవుతారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధుల, అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12:05 గంటల నుంచి 12:25 గంటల వరకు రోడ్ల గుంతల పూడ్చివేత ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి 12:45 వరకు మీడియాతో మాట్లాడి.. అనంతరం విశాఖ వెళతారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. విశాఖకు చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడి ధర కేవలం రూ.20 లక్షలు మాత్రమే.
నవంబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో పర్యటించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గంగచోళ్ల పెంట వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పురిటిపెంట వద్ద రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చే పనుల్లో ఆయన స్వయంగా పాల్గొననున్నట్లు వివరాలు వెల్లడించారు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈవో, వైస్‌ప్రెసిడెంట్‌ను కోరారు. ఏపీలో ఈ- గవర్నెన్స్, డిజిటల్ విద్యకు సహకరించాలని మీటింగ్‌లో ప్రతిపాదించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి తోడ్పాటుతో పాటు స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి లోకేశ్ కోరినట్లు టీడీపీ ట్వీట్ చేసింది.
నరక చతుర్దశి సందర్భంగా గురువారం సింహాచలం ఆలయ ప్రాంగణంలో నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు. నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలోను సింహాద్రి అప్పన్న, శ్రీదేవి, భూదేవి సమేతంగా మరొక వాహనంలోను ఎదురెదురుగా తీసుకువచ్చి నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు. స్వామివారి దర్శనాలు సాయంత్రం 5 గంటల వరకే లభిస్తాయి.
నవంబర్ 2న సీఎం చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గత ఐదేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను ఆయన జిల్లానుంచి ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఆరోజు ఉదయం 10.30 గంటలకు కొత్తవలస మండలం దెందేరు జంక్షన్ వద్ద పనులకు శ్రీకారం చుడతారు. సుమారు రూ.826 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా గోతులు పూడ్చే పనులను తమ స్వహస్తాలతో ప్రారంభిస్తారు.
నెల్లిమర్లలోని EVM గోదాములను కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించిన ఆయన EVMల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఆర్వో ఎస్.శ్రీనివాస మూర్తి, ఆర్డీవో డీ.కీర్తి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్రావు, నెల్లిమర్ల ఎమ్మార్వో సుదర్శన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు బాలికలపై అత్యాచారం ఘటనలో 11 పోక్సో కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మహిళలపై 4 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల గంట్యాడ మండలం కొఠారుబిల్లి జంక్షన్‌లో మూడున్నర ఏళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రామభద్రపురం మండలానికి చెందిన 6 నెలల బాలికపై తాత వరసయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటంతో ఆందోళన కలిగిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.