India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉన్నత విద్యతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. శనివారం తన కార్యాలయంలో చదువులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బంది పిల్లలను అభినందించారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా 87మంది పోలీసు ఉద్యోగుల పిల్లలకు రూ.16.54 లక్షల మెరిట్ స్కాలర్షిప్స్ అందించామన్నారు. మరో 11మందికి రూ.6.95 లక్షలు మెరిటోరియస్ స్కాలర్షిప్స్‌గా మంజూరు చేశామన్నారు. చక్కగా చదువుకోవాలని కోరారు.
ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో జెండర్, పుట్టిన తేదీ, పిల్లలను ఇంటి పెద్దగా, ఇంటి పెద్దని పిల్లలుగా చూపించడం, ఒక ఊరు కార్డు వేరే ఊరు వెళ్లిపోయినట్లు లబ్ధిదారులు అంటున్నారు. సంతకవిటి(M) గుళ్ళ సీతారామపురం గ్రామానికి చెందిన లబ్దిదారుని కార్డులో తప్పలు దొర్లడంతో సీఎస్ డీటీని సంప్రదించగా 20% కార్డుల్లో తప్పులు దొర్లాయని తెలిపారు. మరి మీ కార్డులో వివరాలన్నీ సరిగా ఉన్నాయా?
విజయనగరంలోని బాబామెట్టలో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలపై కేసు నమోదు చేసినట్లు విజయనగరం టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. బాబా మెట్టలోని సప్తగిరి అపార్ట్మెంట్లో శుక్రవారం రాత్రి మహిళలు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. ఈ దాడిలో వారి నుంచి రూ.14,016, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచడానికి రైతులలో అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రకృతి వ్యవసాయంపై వ్యవసాయ అనుబంధ శాఖలతో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో 3 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేయాలని, తదుపరి గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో ప్రస్తుతం 200 ఎకరాల్లో ఆక్వా సాగు అవుతున్నదని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఆక్వాకల్చర్ సాగు జిల్లాలో విస్తృతం చేయు నిమిత్తం గజపతినగరం, బొండపల్లి మండలాల్లో సుమారు 69 ఎకరాలకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆక్వా సాగుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్‌లో జరిగింది. ఆక్వా సాగుకు అనువైన మండలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు.
విజయనగరంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం రైల్యే స్టేషన్ సమీపంలో శుక్రవారం వేకువజామున ఈ ఘటన జరిగింది. గూడ్స్ రైలు టర్నింగ్ తిరుగుతుండగా అదుపు తప్పడంతో ఆఖరి రెండు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. గూడ్స్ కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపడుతున్నారు.
NTR వైద్య సేవల క్రింద వైద్యం పొందుతున్న రోగులకు ఇబ్బంది కలిగిస్తే సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో NTR వైద్య సేవ సేవలపై సమీక్షించారు. రోగి అడ్మిషన్ కాలంలో చెల్లించిన మొత్తాన్ని డిశ్చార్జ్ రోజునే తిరిగి చెల్లించాలన్నారు. అదనంగా వసూలు చేస్తే గుర్తింపు రద్దు చేస్తామన్నారు.
ఇటీవల రద్దు చేసిన వికలాంగ పింఛన్ దారులకు ఈ నెల పింఛన్ అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రద్దు చేసిన పింఛన్ దారులకు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అప్పీల్ చేసుకున్న వారికి మాత్రమే ఈ నెల పింఛన్ అందజేయడం జరుగుతుందన్నారు.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఆగష్టు 18 నుంచి 24వ తేదీ వరుకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. మొత్తం 452 కేసులు నమోదు చేసి రూ.4.75 లక్షల ఈ-చలానాలు విధించామన్నారు. ద్విచక్రవాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. హెల్మెట్ ఉంటే ప్రాణాపాయం నుంచి బయట పడొచ్చన్నారు.
జిల్లా TDP అధ్యక్ష పదవికి పోటీ గట్టిగానే ఉంది. 8 మంది TDP సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు చర్చ సాగుతుంది. వారిలో KA నాయుడు, సువ్వాడ రవిశంకర్, కంది చంద్రశేఖర్, కరణం శివరామకృష్ణ, కోళ్ల అప్పలనాయుడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరో నలుగురుTDP సీనియర్ నేతల అధ్యక్ష పదవికి దరఖాస్తులు చేశారు. ఇటీవల త్రిసభ్య కమిటీ సమావేశం కూడా జరిగింది. 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.