Vizianagaram

News April 4, 2026

జిల్లాలో 8,013 చెరువుల అభివృద్ధి చేయాలి: VZM కలెక్టర్

image

భూగర్భ, ఉపరితల జలమట్టాలు పెంచేందుకు ప్రభుత్వం ఈ నెల 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల ‘జలధార’ కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. చెరువుల పునరుద్ధరణ, కాలువల శుభ్రపరచడం, చెక్‌డ్యామ్‌లు, ఫామ్ పాండ్స్ నిర్మాణం వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలోని 8,013 చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

రెవెన్యూ వసూళ్లలో లక్ష్యాలు చేరుకోవాలి: VZM కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ వసూళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో వివిధ శాఖల రెవెన్యూ వసూళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ & స్టాంప్స్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, గనులు–భూగర్భ, రవాణా, అటవీ శాఖల వసూళ్ల పురోగతిని సమీక్షించి లక్ష్యాలు చేరని శాఖలు వసూళ్లు పెంచాలన్నారు.

VZM వాసి కాకినాడలో మృతి

image

దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన బి. ఆదినారాయణ(42) మూడు నెలల క్రితం కాకినాడ జిల్లాకు కూలీ పనులపై వెళ్లారు. శుక్రవారం అక్కడ వలసపాకల కూడలిలో నడిచి వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. సర్పవరం ఏఎస్సై నాగేశ్వరరావు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 3, 2026

దొంగతనాలు పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: VZM SP

image

వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దామోదర్ శుక్రవారం సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మున్సిపల్ ప్రాంతాల్లో నివసించే వారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (LHMS) సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇళ్లకు బలమైన తాళాలు వేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, రాత్రివేళల్లో లైట్లు వెలిగేలా చూడాలన్నారు.

News April 3, 2026

VZM: పారిశ్రామిక అభివృద్ధికి భూముల పరిశీలన

image

విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక & వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, JC ఎస్.సేధు మాధవన్‌లతో కలిసి రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలోని ఏపీఐఐసీ భూములను పరిశీలించారు. అభివృద్ధికి అనుకూలంగా భూముల వినియోగంపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News April 3, 2026

VZM: ఆ ఉద్యోగులకు నేటి నుంచి సెలవులు లేవు

image

వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి నేటినుంచి సెలవులు లేవని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ అధికారులు తెలియజేశారు. వైద్యసేవ ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మెలో పాల్గొనడం వల్ల జిల్లాలో వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు జిల్లా సమన్వయ అధికారి సాయిరాం తెలిపారు. నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మె విరమించే వరకు సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహించాలని కోరారు.

News April 3, 2026

VZM : అమరావతి రాజధానిపై కలెక్టర్ హర్షం

image

ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ దేశ పార్లమెంటు చారిత్రాత్మక బిల్లును ఆమోదించడంపై కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు అని ఆయన అభివర్ణించారు. కలెక్టర్ మాట్లాడుతూ..సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందన్నారు. రాజధాని ఏర్పాటు వల్ల భారీగా పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు.