India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
21వ అఖిల భారత పశుగణన వాల్ పోస్టర్‌ను గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరులో మంత్రి క్యాంప్ కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువైద్య సిబ్బంది రైతులు ఇంటికి వచ్చినప్పుడు పశువులు ఎన్ని ఉన్నాయి అనేది కచ్చితంగా చెప్పాలన్నారు. ఇచ్చే సమాచారం మేరకు భవిష్యత్‌లో మరిన్ని పథకాల అమలకు ఉపయోగ పడుతుందని అన్నారు.
ప్రమాదవశాత్తూ కాలు జారడంతో ఓ వైద్యుడు మరణించిన ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆశోక్ కుమార్ వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాకు చెందిన పవన్ కుమార్ (44) నెల్లిమర్ల సమీపంలోని మిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 24న స్నానం చేసేందుకు వెళ్లి కాలుజారి కిందపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో విమ్స్‌కు తరలించారు. అదే రోజు మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయనగరం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు DSC ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువును అక్టోబరు 27 వరకు పొడిగించినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బి.రామానంద శుక్రవారం తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను నేరుగా జ్ఞానభూమి పోర్టల్‌లో సమర్పించవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
JNTUలో త్వరలో స్కిల్ సెంటర్ ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విజయనగరంలోని మంత్రి కార్యాలయంలో JNTU ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్ బి.రాజ్యలక్ష్మితో మంత్రి సమావేశమయ్యారు. వీసీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అతి త్వరలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఖరీఫ్ 2024-25 సీజన్‌లో ధాన్యం కొనుగోలు నవంబర్ 2వ వారం నుంచి ప్రారంభం కానుందని సంబంధిత అధికారులు తెలిపారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై అవగాహన పోస్టర్లను కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ఆవిష్కరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. గ్రేడ్ ఏ రకం క్వింటాకు రూ.2,320, గ్రేడ్ బీ రకం క్వింటాకు రూ.2,300 ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.
విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ప్రధాన శాఖలపై సమీక్ష నిర్వహించారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలును సకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఇరువురు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.
గుర్ల ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. రోగులకు రెస్ట్ లేకుండా ప్రజాప్రతినిధులు వరుసపెట్టి గుర్ల చేరుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు మళ్లించడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం కొరవడిందని అధికార పక్షం ఆరోపించగా.. ఈ ప్రభుత్వం పల్లెలను పట్టించుకోకపోవడమే మరణాలకు కారణమని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మరి ఈ ఘటనకు బాధ్యులెవరని మీరు భావిస్తున్నారు.. సమస్యకు పరిష్కారం ఏంటో కామెంట్ చెయ్యండి.
Dy.cm పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బొబ్బిలి వీణల తయారీలో ఉపయోగిస్తున్న పనస మొక్కల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దేశ, విదేశాల్లో ఆదరణ ఉన్న వీణల తయారీలో ముడి సరుకుగా ఉన్న పనస కొరత కారణంగా తయారీదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉపాధి హామీ పథకంలో భాగంగా VZM, పార్వతీపురం మన్యం, SKLM జిల్లాల్లో పనస మొక్కల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా గుర్ల లో డయేరియా మరణాలు, వివిధ గ్రామాల్లో విజృంభిస్తున్న అంటువ్యాధులపై ప్రధానంగా చర్చ సాగనుంది. ఈ సమావేశానికి ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
రావివలస ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు పిసిని.వెంకటప్పడు (57) హార్ట్ ఎటాక్‌తో పాఠశాల పరిసర ప్రాంతంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన వాడని, విధుల నిమిత్తం ఇక్కడ పనిచేస్తున్నారన్నారు. గురువారం విధుల్లో ఉంటూ బయటకు వచ్చారని అక్కడే తీవ్ర గుండె నొప్పితో కుప్పకూలి మృతి చెందారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.