India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఏడాది ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 13,260 మందిపై కేసులు నమోదు చేశామని SP వకుల్ జిందల్ శనివారం తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని, దొరికిన వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ కలెక్టరేట్ వద్ద శుక్రవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పిల్లలకు, ఉద్యోగులకు మిఠాయిలను పంచిపెట్టారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, కలెక్టరేట్ ఏఓ తాడ్డి గోవింద, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ పథకం నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకు విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బస్సులను ప్రారంభిస్తారు. ఎస్.కోట, విజయనగరం డిపోల నుంచి 137 బస్సులను దీనికోసం వినియోగించనున్నారు. ప్రస్తుతానికి రోజుకి సగటున సుమారు 12,900 మంది ప్రయాణిస్తుండగా.. పథకం అమలు తరువాత 21,500 మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు తలపై రాయిపడి మృతి చెందిన సంఘటన ఎస్.కోటలోని ఆకుల డిపో సమీపంలో చోటు చేసుకుంది. గురువారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమీన్ ఖాన్ (17) ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఓభవనం పక్కన కాలకృత్యాలు కోసం వెళ్లాడు. అదే సమయంలో భవనం పైనుంచి నిర్మాణ కార్మికుడు రాయి కిందికి పడేయడంతో అది అమీన్ తలపై పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
ప్రతి పౌరునిలో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయనగరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా సెల్ఫీ పాయింట్ వద్ద ఆమె గురువారం సెల్ఫీ దిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు.
స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ VZM ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ప్రారంభించనున్నారు. రెండు డిపోలకు సంభంధించి 160 బస్సులు నడుస్తుండగా మహిళల ఉచిత ప్రయాణం కోసం 137 బస్సులు వినియోగించనున్నారు. ప్రస్తుతం రోజుకు 12,900 మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం ద్వారా 21,500 ప్రయాణం చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని JC సేతు మాధవన్ ఆదేశించారు. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో వేడుకలకు చేసిన ఏర్పాట్లను గురువారం సాయంత్రం JC పరిశీలించారు. అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని, పతాకావిష్కరణకు ఇబ్బంది ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేయాలని జెసి సూచించారు. RDO కీర్తి ఆదేశించారు.
నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణంలో జిల్లాకు ప్రశంసలు దక్కాయి. దేశంలోని అత్యుత్తమ 10 జిల్లాల్లో విజయనగరం జిల్లాకు స్థానం దక్కింది. CM చంద్రబాబు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో కలెక్టర్ అంబేడ్కర్‌ను అభినందించారు. రాష్ట్రంలో 6 జిల్లాల జాబితాలో VZM జిల్లా కూడా ఉందని, ఈ కట్టడాల నిర్మాణం వల్ల జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరిగి జులై నాటికి 4.15 మీటర్లకు చేరిందన్నారు.
జలవనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషన్, రెస్టోరేషన్ RRR క్రింద రూ.26 కోట్ల అంచనాతో 44 పనులకు కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని అన్నారు. ఈ పనులకు ఆమోదం లభిస్తే జిల్లాలో 6,873 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలను చదివించేందుకు మిగుల సీట్ల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ మాణిక్యంనాయుడు బుధవారం సూచించారు. 25 శాతం సీట్ల కేటాయింపులో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, 5 కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలలకు https://CSE.ap.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 25న లాటరీ ద్వారా ఫలితాలు విడుదల చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.