Vizianagaram

News August 31, 2024

విజయనగరం: పింఛన్ల పింపిణీకి సర్వం సిద్ధం

image

పింఛన్ల పంపిణీ ప్రక్రియను శనివారం ఉదయం 6గంటలకే ప్రారంభించారు. ఆ విధంగా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే తమను సంప్రదించాలని చెప్పారు. రేపు ఆదివారం కావడంతో ఈ రోజు పింఛన్ల పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

News August 31, 2024

వైద్య బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి: VZM కలెక్టర్

image

వర్షాకాలం కావడంతో ఈ రెండు నెలలు సీజనల్ వ్యాధులు ప్రబల కుండా వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. తన కార్యాలయంలో శుక్రవారం సమీక్షలో సంబంధిత అధికారులతో మాట్లాడారు. వైద్య శాఖ జిల్లా అధికారులు బృందాలుగా వేసుకొని జిల్లా అంతటా ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు.

News August 30, 2024

VZM: వినాయక ఉత్సవాలకు సింగిల్ విండో విధానం

image

వినాయక ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి, సులభతరం చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ ఆగస్టు 30న తెలిపారు. ఈ విధానంతో ప్రజలు సులభంగా గణేశ్ ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమర్జనానికి చలానా రుసుమును చెల్లించి, నిరభ్యంతర పత్రం, క్యూఆర్ కోడ్‌ను పొందవచ్చునన్నారు.

News August 30, 2024

ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకాధికారుల నియామకం

image

ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకాధికారులుగా ఇద్దరు IASలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాకు ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న వి.వినయ్ చంద్, పార్వతీపురం మన్యం జిల్లాకు కోన శశిధర్‌ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలపై జిల్లా అధికారుల సమన్వయంతో ఇక మీదట పర్యవేక్షించమని ఆదేశించారు.

News August 30, 2024

VZM: ‘రోగుల నుంచి డబ్బులు తీసుకుంటే చర్యలు’

image

ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులు, సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంతో పాటు వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ సమన్వయకర్త అప్పలరాజు హెచ్చరించారు. గురువారం ఆరోగ్యశ్రీ అనుబంధ విభాగం ఆసుపత్రుల యాజమాన్యాలతో నగరంలోని మహారాజ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఉచిత చికిత్స, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

News August 29, 2024

డెంకాడ: లారీను ఢీకొట్టి యువకుడు మృతి

image

డెంకాడ మండలంలోని గుణుపూరుపేట సమీపంలో లారీను ఢీ కొట్టడంతో పోతయ్య పాలెం గ్రామానికి చెందిన యువకుడు కోరాడ సురేంద్ర గురువారం మృతి చెందాడు. డెంకాడ నుంచి తన ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళుతుండగా ఐరన్ లోడుతో వెళుతున్న లారీను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఇనుప చువ్వలు తలలో గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 29, 2024

VZM: తెలుగు భాషా సంస్కర్త గురజాడ

image

తెలుగు భాషకు వాడుక పదజాలాన్ని జోడించి తన రచనలను సామాన్యులకు దగ్గర చేశారు మహాకవి గురజాడ అప్పారావు. అప్పటి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే విధంగా స్థానిక మాండలికంలో రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం నేటికీ నిత్యనూతనం. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనే దేశభక్తి గీతంతో తెలుగు భాషకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గురజాడ జ్ఞాపకం తెచ్చుకోవడం సందర్భోచితం.

News August 29, 2024

ట్రైబల్ యూనివర్సిటీ పనులు వేగవంతం కావాలి: VZM కలెక్టర్

image

మెంటాడ వద్ద నిర్మించ తల పెట్టిన ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించిన అప్రోచ్ రోడ్, విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక వసతుల కల్పన వేగంగా జరగాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలకు చెందిన అంచనాలను రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. మార్చ్ 2025లో తరగతి గదులు ప్రారంభించవలసి ఉన్నందున నిధులు మంజూరు అయిన మర్నాడే పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

News August 29, 2024

VZM: చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

గంట్యాడ మండలం మదనాపురంలో చెట్టు నుంచి జారిపడి ముంత అప్పారావు(50) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ సాయి కృష్ణ అందించిన వివరాల ప్రకారం.. మృతుడు మదనాపురంలోని ఓ షాప్ ఓపెనింగ్ కొరకు నేరేడు కొమ్మలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

News August 29, 2024

VZM: పరుగు పందెంలో ట్రాన్స్ జెండర్స్

image

జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలోని విజ్జీ స్టేడియం లో నిర్వహించిన ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో పలువురు ట్రాన్స్ జెండర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. యూత్‌ఫెస్ట్ కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించిన ఈ మార‌థాన్ పోటీల‌ను బాలురు, బాలిక‌లు, ట్రాన్స్ జెండ‌ర్స్ మూడు విభాగాలుగా విభ‌జించి, ఒక్కో విభాగంలో ప్ర‌ధ‌మ బ‌హుమ‌తి క్రింద రూ.7,000, రెండో బ‌హుమ‌తి క్రింద రూ.4,000 అంద‌జేస్తారు.