India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్( పి-4) సర్వే ఈ నెల 8 నుంచి 18 వరకు జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పి-4 సర్వే పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రధానంగా జీరో పేదరికం లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం పి-4 కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.
విజయనగరం జిల్లాలో కళ్లు గీత, సొండి, శెట్టి బలిజ, శ్రీ సైన, యాత, సెగిడి సామాజిక వర్గాలకు 16 మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. దీని కోసం ఆయా సామాజిక వర్గాల నుంచి మొత్తం 308 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 9 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది.గత నెల 10న లాటరీ తీయాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచింది. అదృష్టవంతులెవరో మరికాసేపట్లో తేలిపోనుంది.
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణాలపై ముద్రించిన పోస్టర్లను తన ఛాంబర్‌లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాల కార్మికులను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే దీనికోసం పోలీసులను కూడా వినియోగించుకుంటామన్నారు.
అప్పటి సతివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివంగత పొట్నూరు సూర్యనారాయణ సతీమణి కనకమ్మ బుధవారం కన్నుముశారు. ఆమె గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పాలవలస సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ప్రజల సందర్శనార్థం పార్ధివదేహాన్ని పాలవలసలోని తన నివాసంలో అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లేబర్ సెస్ వసూలుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. మొత్తం నాలుగు విభాగాల్లో ఒక్క విజిలెన్స్ అలర్ట్ క్రింద సుమారు రూ.12 కోట్లు వరకు బకాయి ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా దీనిని వసూలు చేయడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న సుమారు 1300 క్లైయిములను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. విజయనగరం పట్టణ ట్రాఫిక్ సీఐ సూరినాయుడు నగరంలో బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 18 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున 18 మందికి రూ.1.80 లక్షల జరిమానా విధించారని SP వకుల్ జిందాల్ తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న జిల్లాల్లో ఘనంగా వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ అంబేడ్కర్‌తో మాట్లాడారు. జిల్లాల్లో ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలని, పేదరికం నుంచి వచ్చి, గొప్ప వారైన మహిళలను సత్కరించాలని సూచించారు.
జిల్లా కేంద్రంలో మార్చి 8న చేపట్టే మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను SP వకుల్ జిందాల్ ఆదేశించారు. స్థానిక మహిళ పీఎస్‌ను బుధవారం సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషను వద్ద మార్చి 8న నిర్వహించనున్న మహిళా దినోత్సవ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
చీపురుపల్లిలో జరిగిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరను డ్రోన్స్ పర్యవేక్షణ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు చర్యలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశామన్నారు. భక్తులు సులభతరంగా అమ్మవారిని దర్శించుకొనే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడం, త్వరితగతిన భక్తులను వరుస క్రమంలో పంపేటట్లు బందోబస్తు నిర్వహించామన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా మార్చి 16వ తేదీలోగా ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా తప్పనిసరిగా ఆన్‌లైన్ శిక్షణ పూర్తిచేసుకోవాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్ధ్యాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
Sorry, no posts matched your criteria.