India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఈనెల 13న జాయిన్ అయ్యాడు. బుధవారం ఉదయం టిఫిన్ చేసిన తరువాత హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
డీఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడనున్నట్లు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు బుధవారం పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 45 రోజుల నుంచి 50 రోజుల్లో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మంగళగిరిలోని డీజీపీ హరీష్ గుప్తా చేతుల మీదుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం ABCD అవార్డును అందుకున్నారు. ఇటీవల విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిజిటల్ అరెస్టు కేసును ఛేదించినందుకు రాష్ట్రస్థాయిలో జిల్లాకు అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ ABCD అవార్డును స్వీకరించారు. అనంతరం ఎస్పీను డీజీపీ హరీష్ గుప్తా అభినందించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజయనగరం, విశాఖ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, భరత్ కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం డిస్ట్రిక్ట్ ఎలక్ట్రసిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. పిఎం సూర్య ఘర్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ఇంస్టాలేషన్ గ్రౌండ్ సోలార్ ప్లాంట్స్ ఎస్సి, ఎస్టి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అంబేడ్కర్, అధికారులకు సూచించారు.
బొబ్బిలి వీణను అయోధ్యకు పంపించనున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో తయారు చేస్తున్న ఆ వీణను బుధవారం పరిశీలించారు. అయోధ్యలో బొబ్బిలి వీణను ప్రదర్శనకు ఏర్పాటు చేసి వీణ విశిష్టతను చెపుతామన్నారు. వీణల తయారీకి అవసరమయ్యే పనస కర్ర సరఫరా చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. పనస కర్ర సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
బరువు తక్కువ ఉన్న పిల్లలు పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐసీడీఎస్ సీడీపీవో ఉమాభారతి కోరారు. గంట్యాడ మండలం రావివలసలో బుధవారం జరిగిన పోషణ పక్వాడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువు చూసి బరువు తక్కువ ఉన్న పిల్లలను విజయనగరం ఘోషాసుపత్రిలో చేర్పించాలని తల్లులకు సూచించారు. పౌష్టికాహారం ఇస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.
డెంకాడ (M) చొల్లంగిపేట జంక్షన్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రణస్థలం (M) NGRపురం గ్రామానికి చెందిన జగిలి రామప్పడు(54) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామప్పడు తన భార్య మహాలక్ష్మితో కలిసి ద్విచక్రవాహనంపై గజపతినగరం(M) గంగచోల్లపెంట గ్రామానికి వెళ్తున్నారు. చొల్లంగిపేట జంక్షన్‌కి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి పడిపోయారు. ప్రమాదంలో రామప్పడు అక్కడికక్కడే మృతి చెందారు.
విజయనగరం పట్టణంలోని స్థానిక ఫైర్ స్టేషన్ సమీపంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉల్లి వీధికి చెందిన బూర్లి వాసును అదుపులోకి తీసుకొని విచారించగా అతని సమాచారంతో బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశామన్నారు.
ఇసుక లోడింగ్ కోసం వెళ్తున్న టిప్పర్ రేగిడి (M) రెడ్డి పేట సెంటర్ వద్ద ఆదివారం ఉదయం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో అనకాపల్లికి చెందిన డ్రైవర్ నాగరాజు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తనను కాపాడాలంటూ చేసిన ఆర్తనాదాలతో తోటి డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాగరాజును బయటికి తీసేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయాడు.
కొత్తవలస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన సర్వసిద్ధి వినయ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో శనివారం రాత్రి మృతి చెందాడు. వాహనం బలంగా ఢీకొనడంతో అవయవాలు రోడ్డుపై పడి భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ (27)కి 2023లో వివాహం జరిగింది.
Sorry, no posts matched your criteria.