India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు. ఎన్డీఏ నేతలకు చిత్తశుద్ధి ఉంటే పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాలను వెంటనే సమకూర్చాలని ఆమె ట్విటర్ ద్వారా కోరారు. ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పి బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా ప్లాంట్‌ను చంపాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా పార్వతీపురం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో వాస్తవమని వెల్లడికావడంతో పాచిపెంట మండలం కేసలి పంచాయతీ గ్రేడ్-4 కార్యదర్శి సేనాపతి సునీత. గ్రేడ్-5 కార్యదర్శి వాసును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని పరిశ్రమలు, వివిధ కర్మాగారాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో స్థానికుల సంఖ్యపై వారం రోజుల్లో సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలన్న నిబంధన ఎంతవరకు అమలవుతుందో నిర్ధారించాల్సి ఉందన్నారు. ఆ నివేదికను దేశ అత్యున్నత న్యాయస్థానానికి అందజేయాల్సి ఉన్నందున వారం రోజుల్లో సర్వే పూర్తి చేయాలని సూచించారు.
పథకాలు అందించడమే కాదు.. వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి సంధ్యారాణితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
పొలంలో పంట వేసిన ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ నుంచి పంట రుణం అందాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. CCRC కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఏడాది రుణం అందించాలని తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 13 వేల CCRC కార్డులను కౌలు రైతులకు ఇచ్చినట్లు తెలిపారు.
మామయ్య ఇంటికి వెళ్లి వస్తాను అని రోడ్డు ప్రమాదంలో విద్యార్ధి మృతి చెందడంతో తల్లి దండ్రులు రోదనలు వర్ణనాతీతం. గురువారం రాత్రి బొబ్బిలి-రాజాం రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓమ్మి మణికంఠ (10) మృతి చెందిన సంగతి విధితమే. ఘటనా స్థలిని పట్టణ సీఐ నాగేశ్వరరావు పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
జిల్లాలోని వివిధ రైతు బజార్లు, పీడబ్ల్యుడీ మార్కెట్, డి-మార్ట్, రిలయన్స్, స్పెన్సర్, మోర్ తదితర మార్కెట్లలో శుక్రవారం నుంచి తగ్గింపు ధరకు కందిపప్పు, బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు జేసీ కే.కార్తీక్ తెలిపారు. దేశవాళీ కందిపప్పు కిలో రూ.155 నుంచి రూ.150కి, బియ్యం (స్టీమ్) బిపిటి, సోనామసూరి కిలో రూ.49 నుంచి రూ.48కి, బియ్యం(రా) కిలో రూ.48 నుంచి రూ.47 కి తగ్గించి విక్రయించనున్నట్లు తెలిపారు.
ఆగస్టు ఎనిమిదో తేదీ వరకు కిరండూల్ రైలు దంతేవాడ వరకే నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో ఏజెన్సీలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని వారు కోరారు.
బొబ్బిలి 8వ వార్డు పరిధిలో బొబ్బిలి నుంచి రాజాం వెళ్లే ప్రధాన రహదారిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సైకిల్‌పై వెళుతున్న బాలుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తలపై నుంచి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు గొల్లపల్లి జీ.ఎన్.ఎస్. స్కూల్లో చదువుతున్న మణికంఠగా స్థానికులు గుర్తించారు.
DSC పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారిణి జి.పగడాలమ్మ తెలిపారు. ఉచిత శిక్షణకు గాను బేస్మెంట్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. బేస్మెంట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. అభ్యర్థులు ఈనెల 7వ తేదీలోగా డీఈవో ఆఫీసులో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు.
Sorry, no posts matched your criteria.