India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బొండపల్లి మండలం బిల్లలవలస డయేరియా కేసుల నమోదు ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరా తీశారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. జిల్లా వైద్యాధికారులను వెంటనే అప్రమత్తం చెయ్యాలని సూచించారు. గ్రామాన్ని సందర్శించి, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకొని, గ్రామంలో ఇకపై వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డోంకినవలస-బొబ్బిలి రైల్వే స్టేషన్‌ల మధ్య, గొల్లాది రైల్వే గేట్ దగ్గరలో రైల్వే ట్రాక్ మధ్యలో మహిళ మృతదేహం పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు మహిళ ఏదయినా గుర్తు తెలియని రైలు నుంచి జారి పడిపోవడం వల్ల గాని ఢీ కొట్టడం వల్లగాని తగిలిన గాయాలతో చనిపోయి ఉండవచ్చని తెలిపారు. విజయనగరం GRP SI V.బాలాజీరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయనగరం మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయనగరంతో పాటు రాజమండ్రి, దువ్వాడ, తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో MBBS చదువుతున్న వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ రెడ్డి పద్మావతిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఛైర్మన్లుగా నియమితులై ప్రస్తుతం కొనసాగుతున్న వారిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెడ్డి పద్మావతిని ఛైర్ పర్సన్ తక్షణమే తొలగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు వెలువడ్డాయి.
గూగుల్ సెర్చ్ చేస్తున్నవారినే టార్గెట్‌గా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని విజయనగరం SP వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఎక్కువ మంది తమకు అవసరమైన వాటిని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెతుకుతున్నారని ఆయన అన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి సెర్చ్ చేసే సమయంలో ఆ సైట్ ముందు వరుసలో వచ్చేలా చేసి డబ్బులు దోచుకుంటున్నారని, పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు.
విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ మంత్రి మంత్రి ముత్తంశెట్టి రాజీనామాతో ఆ ప్లేస్‌ను భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మజ్జి శ్రీనివాసరావు విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ శనివారం సజావుగా జరిగింది. మొత్తం 600 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 517 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 83 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరిలో 317 మంది తుదిరాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు.
విజయనగరం ప్రజలు హనీ ట్రాప్‌లో పడొద్దని SP వకుల్ జిందాల్ కోరారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ చేసి ప్రేమ, సెక్స్ పేరుతో ఉచ్చులోకి దించుతారని అనంతరం మీ వీడియోలను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారన్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు సైబర్ క్రైం పోర్టల్‌కు గానీ 1930కి ఫోన్ చేయాలని SP కోరారు. దీనిపై అవగాహన కోసం షార్ట్ ఫిల్మ్ తీసినట్లు శుక్రవారం తెలిపారు.
విజయనగరం జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో మందుబాబులు వైన్ షాపుల ముందు భారీగా క్యూ కట్టారు. జిల్లాలో 177 మద్యం షాపులు, 28 బార్లు ఉండగా 42,000 మద్యం కేసుల విక్రయాలు జరిగాయి. గతేడాది రూ.20 కోట్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది రూ.2 కోట్లు అదనంగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.