India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సెర్ప్ (వెలుగు) డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర జెఏసి నాయకులు అమరావతిలో మంత్రిని గురువారం కలిశారు. గత ప్రభుత్వం హయాంలో స్ట్రైక్‌లో పాల్గొన్న సమయంలో జీతాలు ఇప్పించాలని కోరారు. పెండింగ్ ఇంక్రిమెంట్లు చెల్లించాలని, మండల సమాఖ్య సీసీలకు జీతాలు పెంచాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో ఈ సంవత్సరం బీఈడి, MBA హాస్పిటల్ మేనేజ్మెంట్, బీకాం కంప్యూటర్ సైన్స్, BBA, ఎం.ఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. దూరవిద్యలో 75 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని వీరి సంఖ్యను లక్షకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం లేఖ రాశారు. జొన్నాడ సమీపంలోని ఏర్పాటు చేసిన టోల్ గేట్‌ను కొత్తగా నిర్మించిన విజయనగరం బైపాస్ రహదారిలోకి తరలించాలని ఎంపీ ఆ లేఖలో పేర్కొన్నారు. జొన్నాడ టోల్ గేట్ వలన వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని, పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
చిన్నతనంలోనే మనుమడు మృతిని జీర్ణించుకోలేని తాత(హిజ్రా) ఆత్మహత్య చేసుకున్న ఘటన కురుపాం మండలంలోని తిత్తిరి పంచాయతీలో చోటు చేసుకుంది. కీడవాయికి చెందిన బిడ్డిక పృథ్వి ఇటీవల జ్వరంతో మృతి చెందాడు. పృథ్వి మృతిని తట్టుకోలేక తాత బిడ్డిక పాపన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. గమనించిన కుటుంబ సభ్యులు భద్రగిరి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మ లీల తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీకి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం http://vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పోస్టుల భర్తీ కోసం గతంలో జారీ చేసిన 1/23 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఆ స్థానంలో అదనపు పోస్టులు జోడించి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మలీల తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో 13, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 69 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
నెల్లిమర్ల EVM గోడౌన్‌లో ఉన్న పని చేయని, అదనంగా ఉన్న, ఎన్నికలలో డెమో కు వినియోగించిన డమ్మీలను బెంగళూరుకి తరలిస్తున్నారు. బెల్ కంపెనీకి రెండు వాహనాల్లో కలెక్టర్ డా. బీఆర్.అంబేడ్కర్ ఆధ్వర్యంలో గురువారం పంపించారు. ఎన్నికలలో వినియోగించని (డిఫెక్ట్ ) EVMలలో బీయూలు 174, సీయూలు 930, వివిపాట్‌లు 224 యూనిట్లను బెల్‌కు పంపించారు.
ఫెడెక్స్, బ్లూడాట్ కొరియర్స్ పేర్లతో వచ్చే కాల్స్, లింక్స్, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ తరహా కాల్స్, లింక్స్, వీడియోకాల్స్‌తో సైబర్ మోసగాళ్లు ప్రజలకు ఉచ్చు వేస్తూ, వారి నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారన్నారు. ఎవరైనా నగదు పోగొట్టుకుంటే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. దీంట్లో మొత్తం 54 మంది ఆనాటి ప్రతిపక్ష నేతలు ఉన్నారు. వీరిలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పేరు కూడా ఉంది. ఈయన పై రెండు కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 27న జరగాల్సిన ఎంఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్షను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న యూజీసీ నెట్ ప్రవేశ పరీక్ష ఉన్న కారణంగా ఈ పరీక్షను వాయిదా వేశామని తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. ఆ తేదిల్లో ఎలాంటి మార్పు చేయలేదని సూచించారు.
Sorry, no posts matched your criteria.