Vizianagaram

News March 31, 2024

విజయనగరం: ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు పలువురు దూరం..!

image

కుటుంబంలో ఒకరికే సీటు కేటాయించడంలో పలువురు టీడీపీ సీనియర్లు పోటీకి దూరమయ్యారు. విజయనగరంలో కుమార్తెకు టికెట్ ఇవ్వడంతో అశోక్ గజపతిరాజు, బొబ్బిలిలో తమ్ముడు పోటీలో ఉండడంతో సుజయ్ కృష్ణ రంగారావు, గజపతినగరంలో అన్న కొడుకు అభ్యర్థి కావడంతో కొండపల్లి అప్పలనాయుడు, చీపురుపల్లి సీటు పెదనాన్నకు ఇవ్వడంతో కిమిడి నాగార్జున ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దాదాపు దూరం అయ్యినట్లే కనిపిస్తుంది.

News March 31, 2024

VZM: లవ్ ఫెల్యూర్.. యువకుడు మృతి

image

ప్రేమించిన యువతి మోసం చేసిందని దివ్యాంగ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. భోగాపురం మండలం కంచేరుకు చెందిన యువకుడిని ఓ యువతి మోసం చేసిందనే మనస్థాపంతో పురుగుమందు తాగాడు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి నిన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందాడు.

News March 31, 2024

విజయనగరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గజపతినగరం మండలం మదుపాడ గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు (40) మృతి చెందినట్లు ఎస్.ఐ మహేష్ తెలిపారు. రామారావు కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతనిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు తెలిపారు.

News March 31, 2024

VZM: కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కేంద్రీయ విద్యాలయం (బాబామెట్ట)లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 15న సాయంత్రం వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటో తరగతిలో 32 సీట్లకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఎనిమిది రిజర్వు చేసినట్లు తెలిపారు. రెండు, ఆపై తరగతులకు ఖాళీల మేరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

News March 31, 2024

పార్వతీపురం: ‘సమర్థవంతంగా ఎన్నికల నిర్వహనే లక్ష్యం’

image

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. EVM గోడౌన్‌ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం తనిఖీ చేశారు. సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా, పటిష్టంగా నిర్వహించేలా ప్రతీ నియోజక వర్గంలో EVM, వీవీ ప్యాట్‌లపై శిక్షణ అందించనున్నామని అన్నారు.

News March 30, 2024

మక్కువలో నవవధువు మృతి

image

మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నవవధువు అఖిల (20) మృతి చెందింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు అఖిలకు వివాహమైంది. వివాహ క్రతువు ముగిసిన తర్వాత నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది. బంధువులు పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మక్కువ పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందింది.

News March 30, 2024

VZM: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

image

పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మక్కువ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి పి మురళి, సాల్విన్ సర్టిఫికెట్ నిమిత్తం చీకటి గణపతి అనే వ్యక్తి నుంచి రూ.2,600 తీసుకుంటూ ఏసీబీ డిఎస్పీ, సిబ్బందికి దొరికాడు. దీనిపై ఏసీబీ కేసు నమోదుచేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2024

విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌.. స్కోరర్‌గా విజయనగరం వ్యక్తి

image

విజయనగరానికి చెందిన బీసీసీఐ స్కోరర్ తోట విజయ్‌ను మార్చి31, ఏప్రిల్ 3న విశాఖపట్నంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా నియమించినట్లు ఏపీ క్రికెట్ సంఘం కార్యదర్శి గోపీనాథ్ శుక్రవారం తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా విజయ్ వ్యవహరించనున్నారు.  

News March 30, 2024

VZM: ప్రేమ ముందు ఓడిపోయిన క్యాన్సర్ 

image

ప్రేమించిన అమ్మాయికి క్యాన్సర్ అని తెలిసికూడా పెళ్లి చేసుకుని ప్రేమ ఎంత గొప్పదో చాటి చెప్పారు ఓ యువకుడు. పాచిపెంట మండలం మడవలస వాసి బంటు సాయి క్యాన్సర్‌తో బాధపడుతుంది. అదే గ్రామానికి చెందిన బూతాల పోలరావు ఆమెను ప్రేమించాడు. పెద్దల ఆమోదంతో శుక్రవారం తెల్లవారుజామున వారు వివాహం చేసుకొన్నారు. మంత్రి రాజన్నదొర వైద్యానికి ఆర్థిక సహాయం చెయ్యగా, ఐటీడీఏ లైఫ్ లాంగ్ మందులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

News March 30, 2024

దత్తిరాజేరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

దత్తిరాజేరు మండలం మరడాం నుంచి కోమటిపల్లి వెళ్లే రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని శనివారం ఉదయం వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చుక్క పేట గ్రామానికి చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మానాపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.