India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ MLC రామచంద్రయ్య కుటుంబాన్ని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఇటీవల రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ అకాల మరణం చెందారు. ఈ నేపథ్యంలో కడప కో-ఆపరేటివ్ కాలనీలో ఆయన నివాసంలో బొత్స సత్యనారాయణ రామచంద్రయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం బాధాకరమని వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణిగా డాక్టర్ జీవరాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కానిస్టేబుల్ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులకు శుక్రవారం నుంచి స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో PMT, PET ఎంపిక ప్రక్రియ జరగనుంది. 3,4,6 వ తేదీల్లో మహిళా అభ్యర్థులకు ఎంపికలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ, ఈవెంట్స్ పర్యవేక్షణకు ప్రత్యేకంగా మహిళా పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని చెప్పారు.
పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.18.32 లక్షల ఆదాయం లభించినట్లు దేవాలయ కార్యనిర్వహణధికారి వై.శ్రీనువాసరావు వెల్లడించారు. దేవస్థానంలో విజయనగరం ఏసీ కార్యాలయం నుంచి వచ్చిన జి.శ్రామ్ ప్రసాద్, కె.పద్మావతి పర్యవేక్షణలో గురువారం హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో పైడిమాంబ సేవా సంఘం, రామతీర్థం ఏపీజీవీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
తాటిపూడి రిజర్వాయర్‌కు గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్‌గా పేరును పునరుద్దరిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వాయర్‌కు గొర్రిపాటి పేరును పునరుద్దరించాలని ఎస్.కోట ఎంఎల్ఏ కోళ్ల లలితకుమారి కూడా మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన కృషి ఫలితంగా పేరు పునరుద్దరణ జరిగిందని అధికారులు ప్రకటించారు.
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. 20 విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. టెన్త్ నుంచి PG వరకు విద్యార్హతలు ఉన్నవారికి అవకాశం ఉంది. 1/7/2024 నాటికీ 18-42 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 8 చివరి తేది. మరిన్ని వివరాలకు www.vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. >Share it
జనవరి 5న ఆదివారం ఉమ్మడి విజయనగరం జిల్లా సీనియర్ బాలురు వాలీబాల్ జట్టు ఎంపిక జరుగుతుందని వాలీబాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.సూరిబాబు, కేవీఏఎన్ రాజు గురువారం తెలిపారు. క్రీడాకారులందరూ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాజీవ్ క్రీడా ప్రాంగణంలో హాజరవ్వాలన్నారు. ఎంపికైన క్రీడాకారులను త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు.
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (ఇగ్నో) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ జి.ధర్మారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, డిప్లమా సర్టిఫికెట్ కోర్సుల్లో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు ఎంవీపీ కాలనీలో ఇగ్నో కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
విజయనగరం ఉమ్మడి జిల్లాలో డిసెంబర్ 31న రూ.5.99 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లాలో 5,786 కేసుల లిక్కర్, 2,012 కేసుల బీర్లు కలిపి మొత్తం రూ. 4.30 కోట్లు, పార్వతీపురం జిల్లాలో 2,324 కేసుల లిక్కర్, 678 కేసుల బీర్లు కలిపి మొత్తం రూ.1.69 కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపారు. జిల్లాలో ఇంత మొత్తంలో అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని తెలిపారు.
గుమ్మలక్ష్మీపురం మండలం చెముడు గూడ గ్రామానికి చెందిన ఎన్. రమేశ్ (30) చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. డిసెంబర్ 29న జరిగిన కంది కొత్తల పండగలో ప్రమాదవశాత్తు సాంబర్ అండాలో పడ్డాడు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను స్థానికులు అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మృతుడి భార్య ప్రస్తుతం గర్భిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తూంది.
Sorry, no posts matched your criteria.