Vizianagaram

News June 10, 2024

VZM: జిల్లా వ్యాప్తంగా 249 మందికి ఈ-చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను సోమవారం తెలిపారు. MV నిబంధనలు అతిక్రమించిన 249 మందిపై రూ.67,425 ఈ చలానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 8 మందిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 22 మందిపై జిల్లావ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.

News June 10, 2024

పార్వతీపురంలో వివాహిత సూసైడ్

image

చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన సంఘటన పార్వతీపురంలోని పార్వతీ నగర్‌లో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై దినకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతాడ కుమారి (42) వ్యక్తిగత కారణాలవల్ల శుక్రవారం ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లి జిల్లా ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.

News June 10, 2024

VZM: బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి దోచుకున్నారు

image

ఓ వ్యక్తికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి దోచుకొని.. దాడిచేసిన ఘటన ఆదివారం జరిగింది. ఎస్.కోట మం. వెంకటరమణ పేటకు చెందిన జవ్వాది శ్రీను(32) దేవరాపల్లిలోని అత్తారింటికి శనివారం రాత్రి బయలుదేరాడు. వావిలపాడు నుంచి దేవరాపల్లికి వెళ్తూ, దారిలో బైక్‌పై వస్తున్న వారిని లిఫ్ట్ అడిగాడు. వారు శారదానది వంతెనపై బైక్ ఆపి చాకు చూపిస్తూ పర్సు, సెల్‌ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. శ్రీను సెల్‌ఫోన్ ఇవ్వకపోవడంతో అతనిపై దాడిచేశారు.

News June 10, 2024

44 ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితుల కలయిక

image

సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1980వ సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులు 44 ఏళ్ల తరువాత ఆదివారం ఆత్మీయ సమ్మేళన సమావేశంలో కలుసుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చదువుకున్న సమయంలో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. తమకు చదువు నేర్పిన గురువులను సన్మానించారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు.

News June 10, 2024

జూన్ 12న విశాఖ- చెన్నై వెళ్లి, వచ్చే వాహనాల దారి మళ్లింపు

image

గన్నవరం మండలం కేసరపల్లి IT పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ట్రాఫిక్‌పై ఆంక్షలు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి మీదుగా విశాఖ చేరుకుంటాయి.

News June 9, 2024

రేపే Kalki 2898 AD ట్రైలర్.. విజయనగరంలోని ఈ థియేటర్లో స్క్రీనింగ్!

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్‌ రేపు విడుదలకానుంది. అభిమానుల కోసం విజయనగరం జిల్లాలోని పలు థియేటర్లలో‌ రేపు 6PMకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. విజయనగరంలో ఎన్‌సీఎస్, ఎస్‌వీఎస్ రంజనీ థియోటర్‌లో స్క్రీనింగ్ ఉండగా.. చీపురుపల్లిలో వంశీ, ఎస్.కోటలో శ్రీ వెంకటేశ్వర, సాలూరులో శ్రీ రామ, పార్వతీపురంలో SVC TBR థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్క్రీనింగ్ చేస్తారు.SHARE IT

News June 9, 2024

పార్వతీపురం: బావిలో పడి వ్యక్తి మృతి

image

బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మక్కువ మండలంలో చోటు చేసుకుంది. సీబిల్లికి చెందిన వడ్డి నాగేశ్వరరావు (53) ఈనెల7 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం పాతకాముడువలస సమీపంలో బావిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కొడుకు ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహమూర్తి తెలిపారు.

News June 9, 2024

విజయనగరం: మంత్రి పదవి వరించేది ఎవరినో..?

image

విజయనగరంలో క్లీన్ స్వీప్ చేసిన కూటమి అభ్యర్థుల్లో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. సీనియర్ విభాగంలో కోళ్ల, కిమిడి పదవి ఆశిస్తుండగా.. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన బేబినాయన, అదితి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు జనసేన ఏకైక మహిళా MLA లోకం మాధవితో పాటు ఎస్టీ కేటగిరీలో గుమ్మడి పేరు జోరుగా వినిపిస్తోంది. మరి వీరిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.

News June 9, 2024

నాడు ఈనాడు జర్నలిస్టు.. నేడు విజయనగరం ఎంపీ

image

1995 నుంచి 2000 వరకు ఈనాడులో జర్నలిస్టుగా పనిచేసిన కలిశెట్టి అప్పలనాయుడు.. నేడు విజయగనం ఎంపీ అయ్యారు. ఈనాడు సంస్థ ఉద్యోగిగా ఉన్న తాను ఎంపీగా ఎదగడానికి రామోజీరావే స్ఫూర్తి అని ఆయన తెలిపారు. జీవిత పాఠాలు నేర్పిన ఆయన ఇక లేరన్న విషయం కలిచివేసిందన్నారు. జీవితాంతం రామోజీరావుకు రుణపడి ఉంటానన్న కలిశెట్టి.. రామోజీరావును తలుచుకున్న ప్రతిసారీ కన్నీరు వస్తుందన్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

News June 9, 2024

విజయనగరంలో కూటమికి జైకొట్టిన ఉద్యోగులు

image

విజయనగరం MP స్థానంలో 22,301 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా 13,329(59.74%) ఓట్లు NDAకి పడ్డాయి. YCPకి 6,071(27.21%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 353(1.58%) మంది మాత్రమే ఓటు వేశారు. అరకు MP స్థానంలో 21,432 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా కూటమికి 9,312(43.44%) ఓట్లు పడ్డాయి. YCPకి 5,535(25.83%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 4,113(19.19%) మంది ఓటు వేశారు. రాష్ట్రంలో ఇండియా కూటమికి ఇదే అత్యధికం.