India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డాక్టర్ జీవనరాణి నియమితులయ్యారు. DM&HO కార్యాలయంలో శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన ఎస్.భాస్కరరావు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పని చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు.
యూరప్ లోని 11 దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రతినిధులతో ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ దేశాలలో ప్రవాసాంధ్రుల పరిస్థితులను, కష్టనష్టాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు, సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్నారు.
పొలం పనులకు వెళ్లిన అన్నదమ్ములు <<14944957>>కరెంట్ షాక్‌తో మృతి<<>> చెందిన ఘటన జియమ్మవలస మండలం శిఖబడిలో చోటుచేసుకుంది. గ్రామానికి శ్రీనివాసరావు, సింహాచలం శనివారం సాయంత్రం నీరు కట్టడానికి వెళ్లి వారు విగతజీవులయ్యారు. మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో ఏడాది క్రితం పాముకాటుతో పెద్దన్నయ్య మృతి చెందాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ మృతి చెందడంతో ఆ ఇంటికి మగ దిక్కు లేకుండా పోయిందని కుటుంబ సభ్యుల రోదిస్తున్నారు.
కరెంటు షాక్ తగిలి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వైకుంఠపు శ్రీను, సింహాచలం అనే ఇద్దరు అన్నదమ్ములు మరువాడలో పొలం పని నిమిత్తం వెళ్లారు. పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పార్వతీపురం GRP, RPF పోలీసులు శనివారం కాపాడారు. GRP హెచ్సీ రత్నాకర్ వివరాల ప్రకారం.. పార్వతీపురం బైపాస్ కాలనీకి చెందిన B.తిరుపతిరావు ఆత్మహత్య చేసుకోడానికి బెలగాం స్టేషన్ సమీపంలో పట్టాలపై పడుకున్నాడు. అతనిని గమనించిన గూడ్స్ గార్డు సమాచారమివ్వగా.. వెంటనే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తుఫాన్ నేపథ్యంలో ఎస్. కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ఎంఈవో నర్సింగరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. కాగా ముందస్తు సమాచారం లేకపోవడంతో శనివారం పాఠశాలలకు యథావిధిగా వెళ్లిన విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు. మరి మీ మండలంలో సెలవు ప్రకటించారా ? కామెంట్ చేయండి.
విజయనగరం పోలీసులకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసలు కురిపించారు. బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న 117 కిలోల గంజాయిని ఎస్.కోట పోలీసులు గురువారం చాకచక్యంగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. సినిమాల్లో స్మగ్లర్ల మాదిరి సెపరేట్ డెన్‌లో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం కొత్తవలసలోని కంటకాపల్లిలో జరిగింది. స్థానికుల కథనం.. ఊళ్లో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. ఆ సమయంలో దశ్వంత్ అటుగా వెళ్తూ గుంతలో పడిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంత నీటితో నిండి ఉంది. ఎవ్వరూ గమనించక పోవడంతో మృతి చెంది సాయంత్రానికి తేలాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
కొత్తవలస మండలం వీరభద్రపురం ఎంపీయూపీ పాఠశాల టీచర్ సన్యాసిరావుపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తనను కులం పేరుతో తిట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడని అదే స్కూల్ టీచర్ వాపోయారు. విద్యార్థినులతో సైతం అసభ్యకరంగా ప్రవర్తించి.. వారికి అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నారని ఆమె విమర్శించారు. దీంతో సన్యాసిరావును డీఈవో మాణిక్యం నాయుడు సస్పెండ్ చేశారు. ఆ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావును HM బాధ్యతలు తప్పించారు.
Sorry, no posts matched your criteria.