India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వినియోగదారులకు జులై 8వ తేదీ సోమవారం నుంచి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం, మన్యం జిల్లాల నుంచి ఇసుకను తీసుకువచ్చి కొత్తవలస, డెంకాడ మండలం పెదతాడివాడ, బొబ్బిలి గ్రోత్ సెంటర్ తదితర ప్రాంతాలలో నిల్వ ఉంచామన్నారు.
గజపతినగరం మం. మధుపాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్.ఐ మహేశ్ తెలిపారు. మధుపాడకి చెందిన వేల్పూరి చిట్టెమ్మ (68) కాల కృత్యాలు తీర్చుకోవడానికి రహదారి దాటుతుండగా విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న బైక్ ఢీ కొట్టినట్లు చెప్పారు. చిట్టెమ్మ మహారాజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్.ఐ తెలిపారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి జిల్లాకు విచ్చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి చెల్లూరు చేరుకోగా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. అనంతరం విజయనగరం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు ఇంతటి ఘనవిజయం అందించినందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
విజయనగరం పాత LIC భవనం దగ్గరలో ప్రభుత్వ బాలురు కళాశాల వసతి కేంద్రం-1లో 62 మంది విద్యార్థులు ఉన్నారు. దానికి నెలకు రూ.52 వేల అద్దె చెల్లిస్తున్నారు. కాగా.. ఆ భవనానికి సరైన కిటికీలు, దోమ తెరలు లేవని, తలుపులు పూర్తిగా పాడయ్యాయని విద్యార్థులు వాపోతున్నారు. డైట్ బిల్లులు రూ.6 లక్షల వరకు రావాలని అధికారులే చెబుతుండటం గమనార్హం. ఈ భవనానికి విద్యుత్త్ బిల్లులు కూడా చెల్లించలేదని సమాచారం.
బాడంగి మండలం గొల్లాది సమీపంలోని నక్కలబంద వద్ద రైలు ఢీకొని గొల్లాదికి చెందిన మన్నెల(48) శుక్రవారం మృతి చెందాడు. జీఆర్‌పీ హెచ్‌సీ ఈశ్వరరావు మాట్లాడుతూ.. వ్యవసాయ పనులకు వెళ్తూ పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడని తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకీ మృతదేహాన్ని తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అనుమతులు లేకుండా చేపల చెరువులను నిర్వహిస్తే నోటీసు అందజేస్తామని జేసీ ఎస్.శోభిక తెలిపారు. కలెక్టరేట్లో మత్స్య శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న చేపల పెంపకం సాగుపై సమీక్ష నిర్వహించారు. సుస్థిరమైన చేపల పెంపకానికి కాలుష్యం, వ్యర్థాలు లేకుండా రైతులు తమ సొంత భూమిలో చేపలు పెంపకం చేపట్టాలని ఆమె సూచించారు.
జామి మండలం భీమసింగి శివారులో గురువారం రాత్రి రోడ్డు పక్కన తుప్పల్లో రోజుల వయసున్న ఆడ శిశువు దొరికినట్లు స్థానికులు తెలిపారు. విషయాన్ని అంగన్వాడీలకు తెలుపగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. శుక్రవారం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమచారం అందించారు. ICDS ప్రాజెక్ట్ సూపర్వైజర్ ఎస్.కృష్ణవేణి స్పందించి జిల్లా ఘోషా ఆసుపత్రికి తరలించారు. పాపకు 7రోజుల వయసు ఉంటుందని వైద్యులు తెలిపారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి శనివారం ఉదయం టీటీడీసీ మహిళా ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ వసతులను పరిశీలిస్తారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని మంత్రి కోరారు.
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. దాసన్నపేట కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లా రజక సంఘ నేతల శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రజకులపై సాంఘిక బహిష్కరణ జరగకుండా తక్షణమే రజక చట్టం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్, సన్యాసి, చిన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 10న ఎస్.వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. పది, ఇంటర్, ఐటీఐ. డిప్లొమా ఏదైనా డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హులన్నారు. ఆసక్తి గలవారు 10వతేదిన ఉదయం సర్టిఫికెట్స్ జిరాక్స్‌తో హాజరు కావాలన్నారు.
Sorry, no posts matched your criteria.