India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పశ్చిమ గోదావరి జిల్లాలో గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 139.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి సోమవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా పాలకొల్లు 25.0, మొగల్తూరు 22.2, వీరవాసరం 18.2, యలమంచిలి 17.4, ఆచంట 15.2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదు కాగా పెంటపాడు, తణుకు, ఇరగవరం మండలంలో వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు.
ఈనెల 13న భీమవరానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఆదివారం భీమవరంలోని వీవీఎస్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను శాసన మండలి చైర్మన్ మోషేను రాజు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు, భీమవరం ఇన్ ఛార్జ్ వెంకట్రాయుడు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు కుమార్తె వివాహా వేడుకలో మాజీ సీఎం జగన్ హాజరుకానున్నారు.
భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని ఆమె సూచించారు.
ఏపీ మెడికల్ కౌన్సిల్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తేనే నకిలీ వైద్యులను నిరోధించవచ్చని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆదివారం పెదఅమిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్, రెన్యువల్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్‌లు సక్రమంగా లేకపోతే నకిలీ వైద్యులు పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు.
తణుకు శివారు ఇరగవరం రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన కత్తుల చక్రధరరావు (30) మృతి చెందాడు. మోటార్ సైకిల్‌పై వెళుతుండగా పంట బోదెలో పడి ఉండటం, తల పగిలి ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదాన్ నయీమ్ అస్మి తెలిపారు. భీమవరం డీఎన్‌ఆర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం పోలీసు క్రికెట్ లీగ్‌ను ఎస్పీ ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేయడానికి క్రీడలు ఉత్తమ సాధనమని ఎస్పీ అన్నారు. ఈ లీగ్‌లో జిల్లా నుంచి నాలుగు జట్లు పాల్గొంటున్నాయి.
భీమవరం పట్టణంలోని గాంధీ సర్కిల్లో దాత పోతూరి బాపిరాజు చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా పరిశీలించారు. గాంధీజీ విగ్రహం ప్రాంగణంలో లాన్, మొక్కలు, వాటర్ ఫౌంటెన్, పెయింటింగ్ పనుల పురోగతిపై ఆమె ఆరా తీశారు. ఆగస్టు 15 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు రెండో రోజు శనివారం తణుకులో నిర్వహించారు. అర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హాకీ క్రీడల పోటీలలో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అర్చరీలో జోనల్ స్థాయి పోటీలకు 24 మందిని ఎంపిక చేశారు.
పౌర్ణమి సందర్భంగా సిద్ధాంతం వశిష్ట గోదావరి వద్ద శుక్రవారం రాత్రి గోదావరి మాతకు పంచ హారతులు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సిద్ధాంతంకు చెందిన కలగా భద్రుడు స్వామి ఆధ్వర్యంలో పంచ హారతులు కార్యక్రమం నిర్వహించారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు శుక్రవారం తణుకు మహిళా కళాశాలలో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన రాష్ట్ర చేనేత కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు.
Sorry, no posts matched your criteria.