WestGodavari

News August 10, 2025

భీమవరం: పోలీస్ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

పోలీసుల ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదాన్ నయీమ్ అస్మి తెలిపారు. భీమవరం డీఎన్‌ఆర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం పోలీసు క్రికెట్ లీగ్‌ను ఎస్పీ ప్రారంభించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేయడానికి క్రీడలు ఉత్తమ సాధనమని ఎస్పీ అన్నారు. ఈ లీగ్‌లో జిల్లా నుంచి నాలుగు జట్లు పాల్గొంటున్నాయి.

News August 9, 2025

భీమవరం: అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్

image

భీమవరం పట్టణంలోని గాంధీ సర్కిల్లో దాత పోతూరి బాపిరాజు చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా పరిశీలించారు. గాంధీజీ విగ్రహం ప్రాంగణంలో లాన్, మొక్కలు, వాటర్ ఫౌంటెన్, పెయింటింగ్ పనుల పురోగతిపై ఆమె ఆరా తీశారు. ఆగస్టు 15 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

News August 9, 2025

తణుకులో కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు రెండో రోజు శనివారం తణుకులో నిర్వహించారు. అర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హాకీ క్రీడల పోటీలలో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అర్చరీలో జోనల్ స్థాయి పోటీలకు 24 మందిని ఎంపిక చేశారు.

News August 9, 2025

సిద్ధాంతంలో వశిష్ట గోదావరికి పంచ హారతులు

image

పౌర్ణమి సందర్భంగా సిద్ధాంతం వశిష్ట గోదావరి వద్ద శుక్రవారం రాత్రి గోదావరి మాతకు పంచ హారతులు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సిద్ధాంతంకు చెందిన కలగా భద్రుడు స్వామి ఆధ్వర్యంలో పంచ హారతులు కార్యక్రమం నిర్వహించారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News August 8, 2025

తణుకులో ప్రారంభమైన జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు శుక్రవారం తణుకు మహిళా కళాశాలలో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన రాష్ట్ర చేనేత కార్పోరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు.

News August 8, 2025

భీమవరం: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్‌లో నర్సాపూర్-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేరయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్సై సుబ్రహ్మణ్యం కోరారు.

News August 8, 2025

పాలకొల్లు: క్విట్ ఇండియా స్మారక నాణెం ప్రదర్శన

image

పాలకొల్లు శంభుని పేటలో 83వ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడు కొల్లాబత్తుల సూర్య కుమార్ అరుదైన నాణేన్ని ప్రదర్శించారు. స్వాతంత్ర్య సమరంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకపాత్ర పోషించిందని ఆయన తెలిపారు. 1992లో రిజర్వ్ బ్యాంక్ క్విట్ ఇండియా ఉద్యమ స్వర్ణోత్సవం సందర్భంగా విడుదల చేసిన రూ.1 నాణేన్ని ఈ సందర్భంగా ఆయన చూపించారు.

News August 8, 2025

భీమవర: ఈనెల 9 నుంచి జిల్లా స్థాయిలో పోటీలు

image

74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 9 నుంచి 13వరకు దేశభక్తిని ప్రేరేపించేలా జిల్లాస్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామని శ్రీవిజ్ఞానవేదిక కన్వీనర్ రంగసాయి తెలిపారు. శుక్రవారం భీమవరం వెంకట్రామ ధియేటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలు, విద్యార్థులు, మెప్మా మహిళలకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలను నిర్వహిస్తామన్నారు. విజేతలకు 17న బహుమతులు అందిస్తామని తెలిపారు.

News August 8, 2025

తాడేపల్లిగూడెంలో అగ్నిప్రమాదం.. ఐసర్ వ్యాన్ దగ్ధం

image

తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలో పెయింటింగ్ వేస్తుండగా కార్మికుల ముందే ప్రమాదవశాత్తు ఐసర్ వ్యాన్‌కు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, కేబిన్, టైర్లు, వైరింగ్, ఇంజన్ కాలినట్లు ఫైర్ ఆఫీసర్ మురళి కొండ బాబు వివరించారు.

News August 8, 2025

తణుకులో మూడు రోజులు జిల్లాస్థాయి పోటీలు

image

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 నుంచి మూడు రోజుల పాటు తణుకులో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ రాహుల్ క్రీడాకారులను కోరారు. 10 క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 85000 64372 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.