WestGodavari

News April 2, 2026

ప.గో: కాలువలో మునిగి విద్యార్థి మృతి

image

కాలువలో స్నానానికి దిగిన పదవ తరగతి విద్యార్థి గణపతిరాజు సాహిల్ కుమార్ (16) మృతి చెందాడు. పదో తరగతి పరీక్షలు అయిపోయాయనే ఆనందంతో కొందరు స్నేహితులు కలిసి కాలువలో స్నానానికి దిగారు. ఇరగవరం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సాహిల్ కుమార్‌తో పాటు పదిమంది విద్యార్థులు కలిసి మండపాక నుంచి రేలంగి వెళ్లే రోడ్డులో కాలువలో స్నానానికి దిగారు. సాహిల్ కుమార్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందాడు.

News April 2, 2026

ఎల్‌నినో ప్రభావంపై అవగాహన అవసరం: కలెక్టర్ నాగరాణి

image

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ట్రైనర్స్ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది మరింత మెరుగైన ప్రణాళికలతో రైతులకు అవగాహన కల్పించి సాగులో అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

News April 2, 2026

భీమవరంలో పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

భీమవరంలోని చినరంగనిపాలెం మున్సిపల్ హైస్కూల్ టెన్త్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరు, కేంద్రంలో అమలవుతున్న నిబంధనలను ఆమె నిశితంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వసతులపై ఆరా తీశారు. అధికారుల పర్యవేక్షణ చర్యలను సమీక్షించిన కలెక్టర్, పరీక్షలు ప్రశాంతంగా ముగియడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

News April 2, 2026

కిక్కెక్కిస్తున్న ప.గో: మద్యం అమ్మకాల్లో టాప్-6లో జిల్లా!

image

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలోనే ప.గో. జిల్లా 6వ స్థానంలో నిలిచింది. విశాఖ టాప్‌లో ఉంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1989.97కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. మద్యం బాక్సులు 17.24లక్షలు, బీర్ బాక్సులు 6.34లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1455.0.8కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా..2025-26లో దీనిపై 2శాతం తగ్గాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 55శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

News April 2, 2026

గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి: కలెక్టర్ నాగరాణి

image

జిల్లాలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మాట్లాడిన ఆమె.. పనుల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.

News April 1, 2026

పీఎన్‌జీ కనెక్షన్ల విస్తరణ వేగవంతం చేయాలి: జేసీ

image

జిల్లాలో పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్ల విస్తరణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో గోదావరి గ్యాస్, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్పీజీ సిలిండర్ల కంటే పీఎన్‌జీ ద్వారా నెలకు రూ.100 నుంచి రూ.150 వరకు ఆదా అవుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News April 1, 2026

ఆచంటలో ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్

image

ఆచంటలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పరిసరాలను కలెక్టరు నాగరాణి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, సమీపంలో ఏర్పాటు చేయబోయే పార్కు, వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఆచంట ప్రజలకు ఆధునిక పార్కు అందుబాటులోకి రానుందని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.