WestGodavari

News August 5, 2025

పోలీసు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టంలో 11 అర్జీలు: ఎస్పీ

image

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం పోలీసు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం కార్యక్రమంలో 11 అర్జీలను స్వీకరించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ మాట్లాడుతూ.. ప్రజా పిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విన్నారు.

News August 4, 2025

భీమవరం: ప్రభుత్వం నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలి

image

జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమంపై సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు జరిగింది. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అడాప్షన్ రెగ్యులేషన్స్ 2022 ప్రకారం దత్తత తీసుకునే విధానాలను వివరించారు. దత్తత పొందాలనుకునేవారు www.cara.nic.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

News August 4, 2025

వాట్సప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పించాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వాట్సాప్ గవర్నెన్స్ అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. సచివాలయాల స్థాయిలో ఈ కార్యక్రమం ఎలా అమలవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 26 శాఖలకు సంబంధించి 530 సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

News August 4, 2025

ప్రతి అర్జీని పరిష్కరించాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారుడికి సంతృప్తి కలిగేలా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సైతం సంబంధిత శాఖలకు పంపించాలని సూచించారు.

News August 4, 2025

పేరుపాలెం బీచ్‌లో యువకుడి గల్లంతు

image

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో సోమవారం సాయంత్రం విజయవాడకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. భీమవరంలోని కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న తన్వీర్ తన స్నేహితులతో కలిసి బీచ్‌కు వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

News August 4, 2025

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: జేసీ

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో ఏర్పాట్లపై సమీక్షించిన ఆయన, పెరేడ్ గ్రౌండ్స్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలని సూచించారు. వేడుకల కోసం వేదిక అలంకరణ, ప్రముఖులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News August 4, 2025

భీమవరం: నష్టపరిహారం కోరిన రైతులు.. జేసీ హామీ

image

జాతీయ రహదారి 165 నిర్మాణంలో భాగంగా భీమవరం, గునుపూడి, రాయలం, తాడేరు, చిన అమిరం తదితర గ్రామ రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై జేసీ రాహుల్ శుక్రవారం విచారణ చేపట్టారు. రైతులు లేవనెత్తిన 24 అభ్యంతరాలపై విచారణ చేపట్టారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని జేసీ తెలిపారు. తాము నష్టపోకుండా న్యాయమైన నష్టపరిహారం ఇప్పించాలని రైతులు జేసి రాహుల్‌ను కోరారు.

News August 4, 2025

ప.గో: బ్రో మీకు ఎన్ని మార్కులొచ్చాయి..?

image

ఏపీ కానిస్టేబుల్ పరీక్ష ఫైనల్ స్కోర్ కార్డ్ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ప.గో జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థుల్లో ఫుల్ టెన్షన్ నెలకొంది. ఎన్ని మార్కులొచ్చాయి? కటాఫ్ ఎంత ఉండొచ్చనే చర్చ అభ్యర్థుల్లో నడుస్తోంది. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మన జిల్లాలో కటాఫ్ ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News July 11, 2025

వీరవాసరంలో తిరువణ్ణామలై ఎక్స్ ప్రెస్ హాల్ట్

image

నరసాపురం నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) వీక్లి ఎక్స్ ప్రెస్ ఇక నుంచి వీరవాసరంలో కూడా హాల్ట్ ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ శుక్రవారం తెలిపారు. 2 నిమిషాల హాల్ట్‌కు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందని అయన తెలిపారు. ఈనెల 9న ప్రారంభమైన అరుణాచలం వీక్లి ఎక్స్ ప్రెస్‌లో తాను ప్రయాణించినప్పుడు వీరవాసరం‌లో కూడా హాల్ట్ ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరడం జరిగిందన్నారు.

News July 11, 2025

ప.గో: 641.544 కిలోల గంజాయి ధ్వంసం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాధీనం చేసుకున్న 641.544 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా కొండవీడులోని జిందాల్ అర్బన్ మేనేజ్‌మెంట్ ఈ-వేస్టేజ్ లిమిటెడ్‌లో అధికారులు ధ్వంసం చేశారు. 64 కేసులకు సంబంధించిన ఈ గంజాయిని బాయిలర్‌లో వేసి కాల్చివేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.