India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో.జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సదరన్ క్యాంపులను దివ్యాంగులు సద్విని చేసుకుని సదరన్ ధ్రువపత్రాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు ఏరియా ఆసుపత్రిలోనూ, ఆకివీడు, ఆచంట పిహెచ్సిలు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా క్యాంపుల్లో సదరన్‌కు అప్లై చేసుకోవచ్చు అన్నారు.
నర్సాపురం పట్టణంలోని వలందర్ రేవులో గురువారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గోదావరి తీరం వద్ద పౌర్ణమి వెన్నెల చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. గోదావరి గట్టున వేట పడవలు కట్టేసి ఉండడం, వెన్నెల వెలుగులు గోదావరి నీటిలో పడి తళ్లుకు మనిపించింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతా ప్రజలు గోదావరి తీరానికి విచ్చేసి సెల్ ఫోన్ల్‌లో బంధించారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22న ఏలూరు ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా ఇన్‌ఛార్జ్ వాడపల్లి కిశోర్ బుధవారం తెలిపారు.10, ఇంటర్ , డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. హీరో, మోహన్ స్పింటెక్స్, అపోలో ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు వస్తారని, సుమారు 180 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.
భీమవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఏరియా హాస్పిటల్స్, సీ.హెచ్.సిల పనితీరును క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రుల పని వేళల్లో వైద్యులు ఎట్టి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో ఉండాల్సిందేనని గట్టిగా హెచ్చరించారు. ఎఫ్.ఆర్.ఎస్ హాజరు కచ్చితంగా నమోదు చేయాలని, హాజరు నమోదులో లోటుపాట్లను ఉపేక్షించేది లేదన్నారు.
జిల్లాలో ప్రతినెలా ఒకటో తేదీ నుంచి నిత్యవసర వస్తువులు పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.దాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే పామాయిల్, సన్ ఫ్లవర్ తక్కువ ధరతో అందించే 32 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ధరలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నామన్నారు.
కొవ్వూరు టౌన్‌కు చెందిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ శ్రీనివాస్ షేర్ యాప్ ద్వారా రూ.29.30 లక్షలు పోగొట్టుకున్నాడని టౌన్ సీఐ విశ్వం మంగళవారం తెలిపారు. శ్రీనివాస్ ఇన్స్టాగ్రామ్‌లో మోతిలాల్ అశ్వాల్ ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అనే షేర్ మార్కెట్ యాప్ ద్వారా 4 బ్యాంకు ఖాతాలకు రూ.29.30 లక్షలను చెల్లించారన్నారు. తన షేర్స్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా జమ కాలేదన్నారు. కేసు నమోదు చేశామన్నారు.
గోపాలపురం శివారు జాతీయ రహదారిపై మంగళవారం లారీ ఢీకొని బొర్రంపాలెం గ్రామానికి చెందిన గణేశ్ కుమార్ (42) <<14363209>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం.. అతను కొత్త బైకు కొని, తల్లిదండ్రులకు చూపించేందుకు వెళ్తుండగా లారీ ఢీ కొని కొంతదూరం లాక్కెల్లింది. ప్రమాదంలో గాయపడిన అతడిని రాజమండ్రికి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సతీశ్ కుమార్ తెలిపారు.
ప్రతి బ్రాందీ షాపు, బార్ వద్ద మద్యం తాగేవారికి ఉచిత డ్రాపింగ్ వ్యాన్స్ ఏర్పాటు చేయాలని BJP కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు కీర్తి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ వెట్రి సెల్వికి వినతిపత్రం అందించారు. ఆరోగ్యానికి హానికరమైనా మద్యపాన నిషేధం ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. డ్రాపింగ్ వ్యాన్స్ ఏర్పాటుతో కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. ఈ డిమాండ్‌పై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు.
దేవరపల్లి మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో మంగళవారం విషాద ఘటన నెలకొంది. గ్రామానికి చెందిన సుబ్బయ్యమ్మ పై ప్రమాదవశాత్తు మామిడి చెట్టు మీద పడడంతో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 186 మంది విద్యార్థులకు 158 మంది, మధ్యాహ్నం 186 మందికి 166 మంది హాజరయ్యారని తెలిపారు. ఉదయం 28 మంది, మధ్యాహ్నం 20 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.