WestGodavari

News March 31, 2026

పాలకోడేరు: ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు సత్కారం

image

గొల్లలకోడేరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ చేసిన ఎస్సై ఇజ్రాయెల్, ఏఎస్సై రాంబాబులను ఎస్పీ మంగళవారం ఘనంగా సత్కరించారు. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో కుటుంబాలను పక్కనపెట్టి, ప్రజా రక్షణ కోసం అహోరాత్రులు శ్రమించిన వారి సేవలను ఎస్పీ కొనియాడారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా బాధ్యతలు నిర్వర్తించి సగర్వంగా విరమణ పొందడం అభినందనీయమన్నారు.

మహిళల రక్షణే ప్రథమ ప్రాధాన్యం: ఎస్పీ

image

మహిళలపై జరుగుతున్న నేరాలు, పోక్సో చట్టం కేసుల దర్యాప్తులో అధికారులు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. మంగళవారం గొల్లలకోడేరు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా నాణ్యమైన సాక్ష్యాధారాలను సేకరించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు.

News March 31, 2026

భీమవరం: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి డీఎస్పీలకు సూచించారు. జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. 2025 నవంబర్ నుంచి 2026 మార్చి 15 వరకు జిల్లాలో మొత్తం 18 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. స్కూల్ డ్రాప్ అవుట్ జాబితాలను కమిటీ సభ్యులకు అందించాలని డీఈఓను ఆదేశించారు.

News March 31, 2026

భీమవరం: బడ్జెట్‌ కేటాయింపులపై చర్చ

image

భీమవరం కలెక్టరేట్‌లో ‘బడ్జెట్‌ ఔట్‌రీచ్‌’ సమీక్షలో 2026-27 రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, కలెక్టర్‌ నాగరాణి పాల్గొన్నారు. జిల్లాలో ప్రధానమైన వ్యవసాయం, ఆక్వా రంగాలతో పాటు ఇతర రంగాల విస్తరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. బడ్జెట్ ప్రయోజనాలను ప్రజలకు చేరవేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

News March 31, 2026

ఉండి: ఆస్తి తగదా.. బంధువుపై కత్తితో దాడి

image

ఆస్తి తగాదాలతో ఉండికి చెందిన శేషాద్రి శ్రీనివాస్‌పై ఆయన బంధువు కత్తితో దాడి చేశారు. సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్ భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉండి ఎస్సై నసీరుల్లా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. కుటుంబ కలహాలే దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

News March 31, 2026

తణుకు జాతీయ రహదారిపై యాక్సిడెంట్

image

తణుకు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు ఫ్రూట్స్ లోడుతో వస్తున్న ఆటో తేతలి వై జంక్షన్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.

భీమవరం: బాలికపై లైంగిక దాడి.. 20ఏళ్ల జైలు..!

image

8ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి భీమవరం పోక్సో కోర్టు జడ్జ్ బీ.లక్ష్మీనారాయణ 20ఏళ్ల జైలు శిక్ష విధించారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో 2021లో జరిగిన ఈ ఘటనపై కాళ్ల పోలీసు స్టేషన్లో అప్పట్లో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం నేరస్థుడికి కఠిన కారాగార శిక్షతోపాటు రూ.15వేల జరిమానా విధించారు. బాధితురాలుకి రూ.50,000ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు.