India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గడచిన 24 గంటల్లో జిల్లాలో కురిసిన వర్షపాతం 183.4 మీ.మీ. అని జిల్లా వాతావరణ శాఖాధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా ఆకివీడులో 29.0 మి.మీ, అత్తిలిలో 28.8 మి.మీ, ఇరగవరంలో 22.4 మి.మీ, పెనుగొండలో 16.8 మి.మీ, అత్యల్పంగా గణపవరంలో 2.6 మి.మీ పోడూరులో 3.8 మి.మీ, యలమంచిలిలో 4.4 మి.మీ నమోదు కాగా నరసాపురం, మొగల్తూరు, ఆచంటలో అసలు వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అధికారులు కన్నుల పండుగగా అలంకరించారు. ఈ నెల 20 వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 17వ తేదీ రాత్రి స్వామివారి తీరు కళ్యాణం, 18వ తేదీ రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.
అక్టోబర్ 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14 నుంచి 15 వరకు తేలిక పాటు వర్షాలు కురుస్తాయని, 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ద్వారకాతిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండనాయుడి వైభవాన్ని చాటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల దివ్య క్షేత్రంలో స్వామివారికి ఏటా రెండు పర్యాయాలు(వైశాఖ, ఆశ్వీయుజ మాసాల్లో)ఈ బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తడంతో రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొత్తం5,339 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ నెల 14న లాటరీ పద్ధతిలో షాపులను కేటాయించనున్నారు. దీంతో దరఖాస్తు దారులంతా టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు.
నల్లజర్లలోని శ్రీనివాసరావు కాలనీలో ఉంటున్న సురేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం.. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. కుల పెద్దల సమక్షంలో యువతి తల్లిదండ్రులు యువకుడిని నిలదీయడంతో తనకు సంబంధం లేదని ముఖం చాటేసాడు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసామని సీఐ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు.
ప.గో జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,848 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
భీమవరం- 1,258,
తాడేపల్లిగూడెం-1,222,
తణుకు- 876,
నరసాపురం- 946,
పాలకొల్లు- 873,
ఆకివీడు-240,
ఏలూరు-738,
చింతలపూడి- 783,
భీమడోలు-1,095,
పోలవరం- 597,
జంగారెడ్డిగూడెం-959, అందినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.ఈ నెల 14న లాటరీ పద్దతిలో షాపులను కేటాయించనున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెడ్లూం గ్రామానికి చెందిన 3 ఏళ్ల బాలుడు సాత్విక్ వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో వైద్యం చికిత్స పోందుతున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థతి అంతమాత్రంగానే ఉండటంతో సాయం కోసం సంబంధిత చికిత్స పత్రాలతో ట్విటర్‌లో మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేశారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. సమస్యను పరిశీలించానని త్వరలోనే తన బృందం బాధిత కుటుంబాన్ని సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడంలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో సేకరించిన విరాళాల మొత్తాన్ని రూ.1,17,66,351 లు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెసి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
నిడమర్రు మండలం పెదనిండ్రకొలను తూర్పు వెలమ పేటలో వెలసిన దుర్గమ్మను శుక్రవారం ధనలక్ష్మి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.1.02 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, 140 కాసుల బంగారు నగలతో నిర్వహకులు విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి దేవి అలంకరణలోని అమ్మవారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.