India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దవేగి మండలం కవ్వగుంటలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పోలవరం కుడి కాలువలో పడి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. మృతులు వెంకటేశ్వరరావు (50), మణికంఠ(16), సాయికుమార్ (13)గా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప.గో.జిల్లాలో 175 మద్యం దుకాణాలకు మంగళవారం సాయంత్రానికి 2,658 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తులు అత్యధికంగా వస్తున్నాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఈనెల 11 వరకు టెండర్ల ప్రక్రియకు సంబంధించి గడువు పొడిగించడం జరిగిందన్నారు. 14న లాటరీ విధానం ద్వారా దుకాణాల కేటాయింపు, 16న షాపులు ప్రారంభించేలా చర్యలు చేపడతామన్నారు.
ప.గో.జిల్లాలో రూ.150 కోట్లతో కొత్తగా 40 సబ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ అలపాటి రఘునాధ్‌బాబు అన్నారు. నరసాపురం డివిజన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఆర్డీఎస్‌ఎస్ నిధులతో నిర్మించే ఒక్కొక్క 33 కేవీ సబ్ స్టేషన్‌కు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రతి సబ్ డివిజన్‌లో 6-8 వరకు సబ్ స్టేషన్లను నిర్మిస్తామన్నారు.
ఆచంట వేమవరానికి చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు వివాహిత షేక్ రజియా(33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె స్థానికంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుంది. భర్త సిలార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆచంట ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
దసరా పండగ సందర్భంగా ఈ నెల 9, 10, 11, 12, 14, 15 తేదీల్లో విజయవాడ-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు- విజయవాడకు ఈ నెల 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు తిరుగుతాయన్నారు. ఏలూరు, గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, విజయనగరం, చీపురుపల్లి, మీదుగా ఈ రైళ్లు ప్రయాణిస్తాయన్నారు.
రాష్ట్ర స్థాయిలో కర్నూలులో జరిగిన సంప్రదాయ యోగాసన పోటీల్లో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విషయాన్ని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించడం ద్వారా మైసూర్‌లో నవంబర్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలు ఎంపికైనట్లు వివరించారు. ఆయనను దండగర్ర జడ్పీహెచ్ హెచ్ఎం సీహెచ్. చంద్రశేఖర్ అభినందించారు.
తణుకు మండలం తేతలికి చెందిన భవాని భక్తుడు మంగళవారం రాత్రి స్నానానికి కాలువలో దిగి గల్లంతయ్యాడు. కాజా దుర్గాప్రసాద్ (23) స్థానికంగా ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల భవాని మాల ధరించిన ఆయన అత్తిలి కాల్వలో స్నానానికి దిగి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయోధ్య రామమందిరానికి పునాది డిజైన్ అందించిన పాండురంగారావు మన ప.గో. జిల్లా వాసే కావడం విశేషం. పాలకొల్లు మండలం గొరింటాడ గ్రామం పాండురంగారావు తాతయ్య స్వస్థలం. ప్రస్తుతం వీరు భీమవరంలో స్థిరపడ్డారు. పాండురంగారావు ఆయన సోదరుని కుమారుడు, కోడలితో కలిసి సోమవారం పాలకొల్లు పట్టణంలోని ముఖదారమ్మ ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా వారిని సత్కారం చేశారు.
అయోధ్య రామమందిరానికి పునాది డిజైన్ అందించిన వ్యక్తి తెలుగువాడు కావడం విశేషం. పాలకొల్లు మండలం గొరింటాడ గ్రామం పాండురంగారావు తాతయ్య స్వస్థలం. ప్రస్తుతం వీళ్లు భీమవరంలో స్థిరపడ్డారు. పాండురంగారావు ఆయన సోదరుని కుమారుడు, కోడలితో కలిసి సోమవారం పాలకొల్లు పట్టణంలోని ముఖదారమ్మ ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా గోరింటాడలో సత్కారం చేశారు.
ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DLTC ప్రధానాచార్యుడు ఎస్.ఉగాది రవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఆఫీసు అపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో 4 నెలలు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్ ఆపైన చదివిన వాళ్లు, 15 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.