WestGodavari

News August 29, 2024

ఏలూరులో ఘోరం.. భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

image

ఏలూరు జిల్లా పెదవేగి మండలం ముండూరు గ్రామంలో గురువారం ఘోరం జరిగింది. కట్టుకున్న వాడే భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళ కాళ్లు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ మహిళపై దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 29, 2024

ద్వారకాతిరుమల: ప్రసాదంలో పురుగు ఘటనపై చర్యలు

image

ద్వారకాతిరుమల చిన వెంకన్న ప్రసాదంలో పురుగు కనిపించడంపై ఏలూరుకు చెందిన ఆహార విభాగం అధికారులు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈవో వేండ్ర త్రినాథరావు సైతం స్పందించారు. సంబంధిత గుత్తేదారు రవికి నోటీసులు జారీ చేశారు. అలాగే ఆ విభాగం ఏఈవో, సూపరింటెండెంట్, ఇతర సిబ్బందికి సంజాయిషి నోటీసులు ఇచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News August 29, 2024

ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలి: కలెక్టర్

image

ప్రజలు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం, క్రీడలను అభ్యాసం చేసి ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. రేపు ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో భాగంగా బుధవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రారంభించారు.

News August 29, 2024

క్విజ్ పోటీల్లో వారు మాత్రమే పాల్గొనాలి: ఏలూరు కలెక్టర్

image

భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90 సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆన్ లైన్‌లో క్విజ్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను బుధవారం ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు. మన జిల్లాలో కూడా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. https://www.rbi90quiz.in/ వెబ్ సైట్ లో ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.

News August 28, 2024

పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలి: కలెక్టర్

image

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లాస్ధాయి క్రైసెస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు పూర్తి భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఏవైనా ఘటనలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై అవగాహన కలిగించాలన్నారు.

News August 28, 2024

భీమడోలు మండలంలో దారుణ హత్య

image

భీమడోలు మండలం అర్జవారిగూడెంలో బుధవారం దారుణ హత్య జరిగింది. కృష్ణను ఓ వ్యక్తి మెడపై కత్తితో దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఇదే దాడిలో ఓ వివాహితకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను ఏలూరు ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థల వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

News August 28, 2024

మొగల్తూరు: యువకుడిపై పోక్సో కేసు

image

మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను(17)గర్భవతిని చేయడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వాసు తెలిపారు. బాలిక ఇటీవల అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎనిమిదో నెల గర్భిణీ అని వైద్యులు చెప్పారు. దీంతో అసలు విషయాన్ని బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.

News August 28, 2024

ఏలూరు: ఏటీఎం సెంటరులో సూట్ కేసు.. బాంబు ఉందంటూ భయం

image

ఏటీఎం సెంటరులో ఉన్న సూట్ కేసును చూసిన స్థానికులు బాంబు ఉందంటూ భయపడిన ఘటన ఏలూరులో జరిగింది. పవరుపేటలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం సెంటరులో మంగళవారం రాత్రి సూట్ కేసు ఉన్నట్లు ప్రజలు గుర్తించారు. ఆ విషయం పోలీసులకు చెప్పడంతో బాంబ్ స్క్వాడ్, శునకాలు అక్కడికి చేరుకున్నాయి. తనిఖీ చేసిన అనంతరం సూట్ కేసులో ఏమీలేదని తేల్చడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

News August 28, 2024

30న వనమహోత్సవం.. ఒక్క రోజే లక్ష మొక్కలు

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 30న వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్‌లో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామంలో 200 మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. దీనికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

News August 27, 2024

ఏలూరు: నకిలీ డాక్యుమెంట్స్ దందా.. ఇద్దరి అరెస్ట్

image

ఏలూరు జిల్లాలో ఇన్సూరెన్స్‌ పాలసీల నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి చీటింగ్స్‌కు పాల్పడుతున్న ఇద్దరు కటకటాలపాలయ్యారు. ఈ కేసు వివరాలను కైకలూరు టౌన్ సీఐ కృష్ణ మంగళవారం వెల్లడించారు. యాక్సిడెంట్ కేసులో బాధితులకు క్లైమ్ అందకుండా నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి పోలీసులు, ఆర్టీవో, ఇతర అధికారులను మోసం చేస్తున్న మోహనకృష్ణ (కైకలూరు), అంజనీ కుమార్‌ (ఏలూరు)ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.