India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసాపురం, హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 30 వరకు ప్రతి శని, ఆదివారాల్లో రైలు నంబర్ 07631 శనివారం రాత్రి 11.15కి హైదరాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.35 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ఆదివారం రాత్రి 8గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6గంటలకు హైదరాబాద్ వెళుతుంది. విజయవాడ, గుంటూరు మీదుగా ఈ రైలు నడుస్తుందన్నారు.
అమ్మను కొట్టిందని తమ్ముడు అక్కపై కత్తితో దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో జరిగింది. స్థానికుల కథనం.. ఏసోబు, అతని తల్లి వద్దనే ఎస్తేరు రాణి భర్తతో విడిపోయి ఉంటోంది. తల్లితో అప్పుడప్పుడూ రాణి గొడవ పడేది. ఈక్రమంలో గురువారం వాగ్వాదం జరిగి తల్లిని కొట్టి వెళ్లిపోయింది. పని నుంచి వచ్చిన ఏసోబుకు తల్లి విషయం చెప్పింది. దీంతో ఏసోబు కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.
బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్ మురళీకృష్ణపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేసినట్లు ఏపీవో, గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు జేసీ ధాత్రిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పాఠశాలలో నిర్లక్ష్యంగా ఉన్న ప్రిన్సిపల్ విజయలక్ష్మిని గురుకులానికి సరెండర్ చేశారు.
పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం ఇంఛార్జ్ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు శుక్రవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కావున మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, హాజరు కావాల్సిందిగా అధికారులు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ కనుమరుగైందని వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. గురువారం పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కనుమరుగవడానికి కారణం కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అలాగే గౌడలకు 10శాతం మద్యం షాపులు కేటాయించడం శుభ పరిణామన్నారు.
పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జూమ్ మీట్ ద్వారా నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, అరెస్టులు, దర్యాప్తులపై ఆరా తీశారు. అలాగే దసరా, దీపావళికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
ఏలూరు జిల్లాలో నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఈవో అబ్రహం సూచించారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు నిర్ణీత వేళకు పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సిందే. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కనీసం గంట ముందుగా అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు.
కొయ్యలగూడెం వీఎస్ఎన్ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి వై.రాహుల్ పల్నాడు జిల్లాలో జరిగిన స్టేట్ లెవెల్ క్రీడల్లో పాల్గొని, జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని కళాశాల కరెస్పాండెంట్ స్వామి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి రాహుల్‌ను అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు.
రాజమండ్రి ఎంపీ పురందీశ్వరితో పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం నల్లజర్లలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తమ వేతనాల విషయంలో జీవో ఇచ్చి మరీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కుటుంబ పోషణ భారంగా ఉందన్నారు. న్యాయం చేయాలని ఎంపీకి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
భీమవరం మండలం కొవ్వాడపుంతలో వ్యభిచార గృహంపై దాడి చేసినట్లు సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో మహిళను అదుపులోకి తీసుకుని ఆమెను విజయవాడ ఉజ్వల గృహానికి తరలించామన్నారు. అలాగే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న భార్యాభర్తలను కోర్టులో హాజరు పరిచి అనంతరం తణుకు సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.