WestGodavari

News March 27, 2026

మహిళల భద్రత కోసం శక్తి యాప్: కలెక్టర్

image

భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని “పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013”నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను ఉపయోగించాలన్నారు. స్వయంగా మహిళల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సేవల పనితీరును పరిశీలించారు.

News March 26, 2026

మార్చి 30న టిడ్కో గృహాల పంపిణీ: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో నిర్మించిన 5,056 టిడ్కో గృహాలను (తాడేపల్లిగూడెం 1,120, పాలకొల్లు 2,016, భీమవరం 1,920) మార్చి 30న లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. వివిధ నియోజకవర్గాల్లో పూర్తయిన మరో 259 గృహాలను కూడా అదే రోజున పంపిణీ చేస్తామన్నారు.

News March 26, 2026

భీమవరంలో నో స్టాక్ బోర్డులు

image

భీమవరంలో గ్యాస్ కొరత వేధిస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇంధన కొరత లేదని కలెక్టర్ ప్రకటించినప్పటికీ, పలు గ్యాస్ ఏజెన్సీలు ‘నో స్టాక్’ బోర్డులు పెడుతుండటంపై వారు మండిపడుతున్నారు. దీనివల్ల నిత్యావసరాలకు ఇబ్బంది ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కృత్రిమ కొరత సృష్టిస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

News March 26, 2026

ప.గో జిల్లా ప్రజలకు శుభవార్త

image

ఆచంట(M) అయోధ్య లంకలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీనికి రూ.110 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. ప.గో జిల్లా ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిధులు కేటాయించారు. వంతెన నిర్మాణం పూర్తయితే లంకగ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై Way2News పలు వార్తలు ప్రచురించిన విషయం తెలిసిందే.

News March 26, 2026

ఆ సమయంలో రోడ్లపైకి రావొద్దు: ప.గో కలెక్టర్

image

వేసవి ఉద్ధృతి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

News March 26, 2026

ప.గో: మీ ఊరి నుంచి భద్రాచలానికి డైరెక్ట్ బస్సులు.. ఇవిగో డీటెయిల్స్!

image

ఈనెల 26 నుంచి జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం డిపోల నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ RM గిరిధర్ కుమార్ తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎప్పుడైనా వెళ్లడానికి వీలుగా బస్సులు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయన్నారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని RM తెలిపారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News March 26, 2026

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్