India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నరసాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ జి.శివయ్య బుధవారం సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. వార్షిక ఆదాయం, రిజిస్ట్రేషన్ల విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, భీమవరం పరిధిలోని 15 కార్యాలయాల ద్వారా ఈ నెల 23 నాటికి రూ.425.17 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం విధుల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పెంటపాడు ప్రభుత్వ పాఠశాల వృక్ష శాస్త్ర ఉపాధ్యాయుడు నల్లి పోసియ్య రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం తణుకులో జరిగిన జిల్లా స్థాయి 45 ఏళ్ల విభాగం జావెలిన్ త్రోలో ఆయన ప్రథమ స్థానం సాధించారు. తద్వారా ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న పోటీలకు అర్హత పొందారు. ఆయనను ఎంఈfyలు శ్రీనివాస్, రామకృష్ణ ఘనంగా అభినందించారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ భారంగా మారింది. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చోట్ల చికెన్ ధర ఏకంగా రూ. 380కి చేరింది. దీంతో ఫంక్షన్స్ చేసుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. రానున్న రోజుల్లో ధర రూ. 400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

ప.గో జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బుధవారం స్లాట్ బుకింగ్ దందా యథేచ్ఛగా సాగుతోందని రిజిస్ట్రేషన్ దారులు ఆరోపిస్తున్నారు. ఉచితంగా జరగాల్సిన బుకింగ్‌లను ముందే నకిలీ పేర్లతో బ్లాక్ చేసి, అవసరమైన వారి నుంచి రూ.1500 నుంచి రూ.2000 వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని అధికారులను కోరుతున్నారు.

జిల్లాలో పసిపిల్లల విక్రయాలే కాకుండా రెండు సంవత్సరాల మోక్షిత్ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పసిపిల్లల విక్రయాల కేసులో జనసేన మండల నాయకుడు అనిశెట్టి నాగబాబు తల్లి వీరమ్మను మాత్రమే అరెస్టు చేశారు. ఇందులో నాగబాబు, అదేవిధంగా మరో నాయకుడు ఆంజనేయులు అలియాస్ అంజిబాబు ఉన్నప్పటికీ వారిని అదుపులోకి తీసుకోలేదు.

ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సరఫరాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు 8121676653 కాల్ సెంటర్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.

ప.గో జిల్లాలో దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాల జారీని మరింత సులభతరం, పారదర్శకం చేసేందుకు డిజిటల్ విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈనెల 25 బుధవారం నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దివ్యాంగత్వ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మార్చి 30, 31 తేదీలతో పాటు ఏప్రిల్, మే నెలలకు కూడా ముందస్తు టోకెన్లు జారీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సరఫరాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల లోపు 8121676653 కాల్ సెంటర్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.

Sorry, no posts matched your criteria.