WestGodavari

News April 16, 2025

కాళ్ల: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో టీచర్

image

కాళ్ల మండలం సీసలి హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న చెల్లుబోయిన పద్మ సంగీత వాయిద్య ప్రదర్శనల్లో అత్యంత ప్రతిభ కనబర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. కీబోర్డ్ ఉపయోగించి సంగీతంలో మంచి ప్రతిభ కనబర్చిన పద్మకు హైదరాబాద్ హలెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందించారు.

News April 16, 2025

ప.గో: సూర్యఘర్ పథకం అనుకున్నంతగా లేదు..కలెక్టర్ 

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం సీఎం సూర్యఘర్ పథకం అమలుపై జిల్లాలోని విద్యుత్ శాఖ ఈఈలు, డిఇలు, ఏఈలతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఇప్పటివరకు14,392 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చేయగా, 917 గృహాలకు మాత్రమే సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో ఈ పథకం అమలు అనుకున్నంత వేగంగా జరగటంలేదని అసహనం వ్యక్తం చేశారు.

News April 14, 2025

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా చెరుకువాడ

image

వైసీపీ పీఏసీ సభ్యులను పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. ఈ జాబితాలో రాష్ట్ర మాజీ మంత్రి, ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు చోటు దక్కింది. పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర, ఆచంట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రంగనాథరాజుకు అభినందనలు తెలుపుతున్నారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 

News April 14, 2025

కొవ్వూరు: అప్పు అడిగినందుకు హత్య

image

ఇటీవల దొమ్మేరు పుంతలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన పెండ్యాల ప్రభాకర్‌రావు వేస్టేజ్ ఉద్యోగిగా పనిచేసేవారు. ఇతని వద్ద పెద్దవం సచివాలయ సర్వేయర్ శ్రీనివాస్ 2024లో రూ.2.4లక్షల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ పలుమార్లు అడగడంతో విలాసాలకు అలవాటు పడ్డ శ్రీనివాస్ కక్ష పెట్టుకుని మరో ఇద్దరి సాయంతో హత్య చేసి కుడి చేతికున్న బంగారం కోసం చేతిని నరికేశారు. నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు.

News April 14, 2025

కైకలూరు: బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

image

కైకలూరు స్టేషన్ నుంచి వెళుతున్న తిరుపతి బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల ఏసీ కోచ్ మీద పెద్ద చెట్టు విరిగిపడింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ట్రైన్ సిబ్బంది చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

News April 13, 2025

భీమవరంలో చికెన్ రేట్లు ఇలా.!

image

భీమవరం, పాలకోడేరు, వీరవాసరం మండలాలు చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ ధర రూ.800 నుంచి రూ .1000 మధ్యలో ఉంది. అలాగే చికెన్ కేజీ రూ. 240 – రూ.260 మధ్యలో ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

News April 13, 2025

ప.గో: రెండు నెలలు చేపల వేట బంద్

image

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెండు నెలల పాటు చేపల వేట నిషేంధించినట్లు ప.గో జిల్లా మత్స్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదన్నారు. మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి, నిర్వహణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News April 13, 2025

భీమవరం : మహిళపై ఇద్దరి అసభ్య ప్రవర్తన

image

ఇళ్లలో పని చేసుకుని బతుకుతున్న ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన భీమవరంలో జరిగింది. రాయలం గ్రామానికి చెందిన మహిళ భర్త చనిపోవడంతో ఇళ్లలో పనిచేసుకుని జీవిస్తోంది. గురువారం ఆమె పని నుంచి ఇంటికి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన కుమార్, అతని ఫ్రెండ్ ఆమెను అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ మేరకు మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భీమవరం టూ టౌన్ ఎస్సై రెహమాన్ తెలిపారు.

News April 12, 2025

ఇంటర్ రిజల్ట్స్.. ప.గో జిల్లాకు 10వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 14,260 మంది పరీక్షలు రాయగా 11,948 మంది పాసయ్యారు. 84 శాతం పాస్ పర్సంటేజీతో జిల్లా రాష్ట్రంలోనే 10వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 17,257 మందికి 12,046 మంది పాసయ్యారు. 70 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది.

News April 12, 2025

ప.గో: బావ.. నా రిజల్ట్ చూడు రా..!

image

పశ్చిమగోదావరి జిల్లాలో 37,831 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్‌లో 19,708 మంది, సెకండియర్‌లో 18,123 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్‌టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘బావ.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్‌లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.