WestGodavari

News March 4, 2025

సర్వేలను సకాలంలో పూర్తిచెయ్యాలి: కలెక్టర్

image

జిల్లాలో సర్వేలను సకాలంలో పూర్తిచెయ్యలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆమె మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష గూగుల్ మీట్ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్న సర్వేలపై చర్చించారు. పి-4 సర్వేపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

News March 3, 2025

ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

image

✷ తణుకులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా అఘోరి ✷ నన్నయ యూనివర్సిటీ అధ్యాపకురాలికి అరుదైన గౌరవం ✷ భీమవరం: ఇయర్ ఫోన్స్ వాడకం తగ్గించాలి  ✷ గోదావరి పుష్కరా పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ✷ అత్తిలిలో సాగునీరు అందించాలని ఆందోళన ✷మహిళా దినోత్సవం రోజున భారీ ర్యాలీ 

News March 3, 2025

రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలి: జేసీ

image

రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం మండలం చినమిరం గ్రామంలో 62 నెంబరు రేషను షాపును జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టరును, కార్డుదారులకు పంపిణీ చేసే రికార్డులను పరిశీలించారు. ఎండీయూ వాహనంపై సరుకుల వివరాలు రేట్లు పట్టికను పరిశీలించారు.

News March 3, 2025

ఏలూరు : పోస్టల్ బ్యాలెట్‌లో 42 చెల్లని ఓట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల కౌంటింగ్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కొనసాగుతోంది. ఇందులో మొత్తం పోస్టల్ బ్యాలెట్‌లో 243 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వ్యాలిడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 201, ఇన్ వ్యాలిడ్ (చెల్లని) ఓట్లు 42 గా సమాచారం.

News March 3, 2025

ప.గో : మద్యం దుకాణాలు బంద్

image

మరి కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీంతో ఆదివారం రాత్రి నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వాటిని తెరిచే ప్రసక్తే లేదని ఎన్నికల అధికారి, కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేపట్టి, అల్లర్లకు కారకులైతే కఠిన చర్యలు తప్పవన్నారు.

News March 3, 2025

ప.గో : కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర

image

గత నెల 27వ తేదీన జరిగిన ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా అభ్యర్థులు అందరూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితం సోమవారం సాయంత్రం 6 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది.

News March 3, 2025

పాలకొల్లు: మాజీ మంత్రి జోగయ్యకు బన్నీ వాసు పరామర్శ

image

ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను ఆదివారం పాలకొల్లులో జనసేన నేత బన్నీ వాసు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. పలు రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోనం చినబాబు, శిడగం సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

News March 2, 2025

ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

image

✷ ప.గో జిల్లాలో ఊపందుకున్న చికెన్ అమ్మకాలు ✷ మావుళ్ళమ్మ అమ్మవారి సేవలో యాంకర్ ఓంకార్ ✷ వేల్పూర్‌లో చికెన్ మేళా ✷ మత్స్యకారుల అభివృద్ధికి కృషి : కేంద్ర సహాయ మంత్రి ✷ ఉండిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి✷ పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి ✷ పాలకొల్లును కమ్మేసిన పొగ మంచు✷కాలువలోకి దూసుకెళ్లిన రొయ్యల లారీ.

News March 2, 2025

భీమవరం: మావుళ్ళమ్మ సేవలో యాంకర్ ఓంకార్

image

భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని ప్రముఖ యాంకర్ ఓంకార్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. ఓంకార్‌తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.

News March 2, 2025

మత్స్యకారుల అభివృద్ధికి కృషి: కేంద్ర మంత్రి

image

‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదేశించారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో మత్స్య శాఖ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను విన్నారు, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.