India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉండి మండలం యండగండి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతు సేవ కేంద్రం ద్వారా కొనుగోలు సక్రమంగా జరుగుతుందా, అధికారులు మీకు సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలపాలన్నారు. రైతులతో కలిసి తేమ శాతం పరిశీలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ రెసిడెన్షియల్ & లాడ్జిపై టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9మంది అమ్మాయిలు, 9మంది అబ్బాయిలు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకుడు అంతం శ్రీను పరారైనట్లు స్థానికులు తెలిపారు.
రీ ఓపెన్ అయినా అర్జీల విషయంలో మరింత జవాబుదారితనం కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారం తీసుకున్న చర్యలు, రీ ఓపెన్ అయిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లోని సమస్యలపై చర్యలు చేపట్టి పరిష్కరించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులచే విద్యను నేర్చుకుని మంచి ప్రయోజకులు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనపై శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారని, నిర్ణీత విద్య అర్హతలతోపాటు పోటీ పరీక్షలలో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయులుగా పాఠశాలలో నియమించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను నరసాపురం ఆర్డీఓ దాసిరాజు ఆదేశించారు. సోమవారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో 42 ఫిర్యాదులు అర్జీదారుల నుంచి స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప.గో జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌కు 23 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
అనకాపల్లి జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?
డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి ప.గో జిల్లాలో 1035 పోస్టులు భర్తీ చేయనున్నారు. రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
➣OC-421, ➣BC-A: 75, ➣BC-B: 102, ➣BC-C:10, ➣BC-D:68, ➣BC-E: 39, ➣SC గ్రేడ్1- 20, ➣SC గ్రేడ్2- 64, ➣SC గ్రేడ్3- 77, ➣ST- 61, ➣EWS- 98 పోస్టులు కేటాయించారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన పెంటపాడు(M) ఆలంపురం వద్ద ఆదివారం జరిగింది. మౌంజీపాడుకి చెందిన నిర్మల(42) తన కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా అలంపురం వద్ద అకస్మాత్తుగా కుక్క అడ్డు వచ్చింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ఇద్దరు కిందపడ్డారు. నిర్మల తలకు బలమైన గాయం తగలడంతో తణుకు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న పాలకొల్లుకు చెందిన ఎం.వెంకటరావు, ఏ.మురళీలను ఆదివారం పాలకొల్లు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరసాపురం డీఎస్పీ శ్రీవేద వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా హైదరాబాద్, విశాఖ కేంద్రంగా ఇరువురు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. నిందితుల నుంచి 10 మొబైల్ ఫోన్లు, రూ.33,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.