WestGodavari

News July 20, 2024

నరసాపురం- గుంటూరు రైలు పునరుద్ధరణ

image

రైల్వే లైన్ల మరమ్మతుల్లో భాగంగా ఇటీవల నిలుపుదల చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి నరసాపురం- గుంటూరు, 22 నుంచి గుంటూరు- నరసాపురం రైళ్లు యథావిధిగా నడుస్తాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News July 20, 2024

ప.గో.: నేడు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు

image

విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ప.గో., ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులు నాగమణి, అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ఆర్వో చంద్రశేఖర్ బాబు చెప్పారు.

News July 20, 2024

ఏలూరు జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు: విశ్వనాథ్

image

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జిల్లాలోని అన్ని గ్రామాలలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏలూరు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా 1450 తాగునీటి ట్యాంకులను శుభ్రపరచి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న 1400 మంది క్లాప్ మిత్రాల సేవలను గ్రామాల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు.

News July 19, 2024

పోలవరం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

image

పోలవరం ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం వరకు నమోదైన నీటిమట్టం వివరాలను ఈఈ పెద్దిరాజు 6 గంటలకు వెల్లడించారు. స్పిల్ వే ఎగువన 28.890 మీటర్లు, స్పిల్ వే దిగువన 19.250 మీటర్లు, కాపర్ డ్యామ్ ఎగువన 29.100 మీటర్లు, కాపర్ డ్యామ్ దిగువన 1.740 మీటర్లు, కాపర్ డ్యాముల మధ్య 18.820 మీటర్ల నీటిమట్టం నమోదయినట్లు ఈఈ ప్రకటించారు.

News July 19, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టరేట్ల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప.గో కలెక్టర్ సి.నాగరాణి, ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం సాధారణ సెలవు కావడంతో తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. SHARE IT..

News July 19, 2024

ఉమ్మడి పశ్చిమ గోదావరికి వర్ష సూచన

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వానలకు ఏలూరు జిల్లా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది. పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఉమ్మడి ప.గో జిల్లాకు హెచ్చరికలు జారీ చేసింది. శనివారం సైతం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. SHARE IT..

News July 19, 2024

నరసాపురం MPDO కనిపిస్తే ఈ నంబరుకు కాల్ చేయండి

image

నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అదృశ్యమైన ఎం. వెంకటరమణారావు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు, గాలింపు చర్యలకు తన ప్రత్యక్ష పర్యవేక్షణలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు,15 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో సమాచారాన్ని 94407 97400, 94406 27051, 94910 63910 నంబర్లకు తెలియజేయాలని కోరారు.

News July 19, 2024

ప.గో: సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు

image

ప.గో జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్య శాఖ సంయుక్త సంచాలకుడు ఆర్వీఎస్ ప్రసాద్ మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్ర అలలు ప్రమాదకరంగా ఉంటాయని తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. 

News July 19, 2024

మంచినీటి వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల

image

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు మున్సిపాలిటీ మంచినీటి సరఫరా విభాగ పథకంను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో రాష్ట్రంలో తాగునీటి వ్యవస్థ విధ్వాంసానికి గురైందన్నారు. దాదాపు 56 మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభంకాక కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. తాగునీటి కోసం కేటాయించిన రూ.5,350 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.

News July 19, 2024

ఏలూరులో APEPDCL కంట్రోల్ రూం

image

ఏలూరు జిల్లాలో ప్రస్తుత వర్షాలు, రాబోయే 3 రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలపై 94409 02926 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. SHARE IT..