India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మతిస్థిమితం లేని 15ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి లోబర్చుకొని గర్భవతిని చేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరులోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక 10వ తరగతి చదువుతోంది. 2రోజుల క్రితం కడుపునొప్పి రాగా కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి 7వ నెల గర్భిణి అని చెప్పారు. బాలిక తల్లి ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
పశ్చిమ గోదావరి కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు 2024-25 సంవత్సరానికి సెప్టెంబర్ 5న జరగబోవు గురుపూజోత్సవ పురస్కరించుకుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ నామినేషన్లకు దరఖాస్తు స్వీకరణ ఈనెల 24 లోపు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. నామినేషన్ దరఖాస్తులను సంబంధిత మండలంలోని విద్యాశాఖ అధికారులకు సమర్పించాలన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న అవార్డు అందజేస్తారని అన్నారు.
ప.గో జిల్లా ఉండి రెవెన్యూ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న అండలూరు నందీశ్వరరావు శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కాళ్ల పోలీసులు తెలిపారు. పెదఅమిరంలోని రోడ్డు పక్కన గల చెట్టుకు ఆయన ఉరివేసుకొని ఉండగా.. పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసికొని ఉండవచ్చని బంధువులు చెబుతున్నారు.
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. కూలి పనుల కోసం భర్తతో కలిసి వచ్చిన మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. రామకోటి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. భర్తకు మద్యం తాగించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. సహకరించకుంటే భర్తను చంపేస్తామని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని కన్నీరుపెట్టుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కార్యాలయ కూల్చివేతలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. రెండేళ్ల లీజు కోసం స్థలం తీసుకుని తాత్కాలిక నిర్మాణం చేపట్టామన్నారు. లీజు గడువు ముగియడంతో భవనాన్ని యజమానికి అప్పగించామని చెప్పారు. ఇక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగతంగా ఇకపై అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో పూరీ- కాశీ- అయోధ్య యాత్రను నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్ రాజా తెలిపారు. ఈ యాత్రలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. వచ్చే నెల 1న సికింద్రాబాద్‌లో యాత్ర రైలు బయలుదేరి విజయవాడ, ఏలూరు, స్టేషన్లో ఆగుతుందన్నారు.
నిడమర్రు మండలం పెదనిండ్రకొలనుకి చెందిన ఝాన్సీ, భర్త శ్రీను (38) మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. శుక్రవారం వారు నివాసం ఉంటున్న ఎస్సీ కాలనీలో రేకుల షెడ్డు కూల్చివేత విషయంలో వాగ్వాదం జరగ్గా భర్తను నిలువరించే ప్రయత్నంలో గుణపంతో ఇద్దరి మధ్య తోపులాట జరగింది. దీంతో ఆవేశంలో శ్రీను తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఎస్సై వీర ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో పూరీ- కాశీ- అయోధ్య యాత్రను నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్ రాజా తెలిపారు. ఈ యాత్రలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. వచ్చే నెల 1న సికింద్రాబాద్‌లో యాత్ర రైలు బయలుదేరి విజయవాడ, ఏలూరు, స్టేషన్లో ఆగుతుందన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు శుక్రవారానికి 5 కోట్ల కేజీలు పూర్తయ్యాయి. అధికారికంగా బోర్డు సుమారు 50 మిలియన్ కేజీలకే అనుమతి ఇచ్చింది. సెప్టెంబరు రెండో వారం నాటికి వేలం పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది పొగాకు ధర కేజీకి గరిష్ఠంగా రూ.400 పలికింది. సరాసరి రూ.332.97 చొప్పున లభించింది. మార్చిలో వేలం ప్రారంభ సమయంలో కేజీ రూ.240గా ఉంది.
కోల్‌కతాలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా వైద్యులు నేటి నుంచి నిరసన చేపట్టనున్నారు. జాతీయ వైద్యసంఘం పిలుపు మేరకు నేటి ఉదయం నుంచి 24 గంటల పాటు ఉమ్మడి జిల్లాలో 1,350 ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులంతా సేవలు నిలిపివేయనున్నారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరవుతారు.
Sorry, no posts matched your criteria.