India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వెనుకబడిన తరగతుల వర్గాల నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. బీసీ-ఎ,బీ,డీ,ఈ, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి స్వయం ఉపాధి పథకాలు, జనరిక్ ఫార్మసీలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు *https://apobmms.apcfss.in* ద్వారా ఆన్‌లైన్లో మార్చి 22వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిన గ్రామాలలోని రైతులకు 9(2) నోటీసులను అందచేయాలని జేసీ రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ డివిజన్ అధికారులతో మాట్లాడారు. 13 గ్రామాలలో రైతులకు 9(2) నోటీసులను అందజేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు తన భూమికి సంబంధించి నోటీసులు అందలేదని ఫిర్యాదులు రాకూడదన్నారు.
ప.గో జిల్లాలో ఫించనుదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 20 లోగా జీవన ప్రమాణాల పత్రం సంబంధిత అధికారులకు అందించాలని, లేకుంటే మార్చి నెలకు సంబంధించిన పింఛను సొమ్మును నిలిపివేస్తామని తెలిపారు. జిల్లాలో మొత్తం 14, 739 మంది ఉండగా.. గత నెల చివరి వరకు 14, 335 మంది పత్రాలను అందించినట్లు తెలిపారు. మిగిలిన వారికి పింఛను ఆపేసే అవకాశముందన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయి నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం ఏం చేయబోతుందన్నదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన సురేందర్ తెలంగాణలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పోలీసులు మంగళవారం సురేందర్ నేరాలను వివరించారు. 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దొంగతనం చేసినట్లు వెల్లడించారు. మొదటిసారి అమ్మకు చీర కొనడానికి రూ.300 దొంగతనం చేశాడన్నారు. అతడి వద్ద రూ. 45 లక్షల సొత్తు రికవరీ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.
ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.
ఆకివీడు మండలం చెరుకుమిల్లి శివారు ఉప్పరగూడెం గ్రామానికి చెందిన ద్రోణాద్రి నరసన్న అదే గ్రామానికి చెందిన మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నరసన్న భార్య కువైట్ వెళ్లింది. తన భార్యతో ఫోన్లో మాట్లాడాలని స్నేహితురాలిని ఇంటికి పిలిచాడు. ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. మహిళ ఫిర్యాదుతో ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ మూడో తేదీ నుంచి జరగనున్న పదో తరగతి స్పాట్ మూల్యాంకనంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న వారికి మినహాయింపు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓకి వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు మాట్లాడుతూ ప్రెగ్నెంట్ ఉమెన్, 60 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
సినిమా యాక్టర్లు అంటే పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఓ క్రేజ్ ఉంటుంది. లింగపాలెంకు చెందిన తరుణ్ సాయి హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలు ఎవరూ ఊహించిన విధంగా తరుణ్ సాయి హీరో అయ్యాడు. స్థానిక శ్రీనివాసరావు, కుమారి దంపతుల పెద్ద కుమారుడికి హీరోగా అవకాశం వచ్చింది. ఈయన హీరోగా నటించిన పెళ్లిరోజు సినిమా దాదాపు పూర్తైంది. ఏప్రిల్‌లో విడుదల చేయటానికి సిద్ధమవుతున్నారు.
కాళ్ల మండలం సీసలి గ్రామంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. గర్భాలయంలోని శివలింగాన్ని సుమారు పది నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులపాటు స్వామివారి లింగాన్ని సూర్యకిరణాలు తాకటం విశేషమని తెలిపారు. భక్తులు తరలివచ్చి అద్భుత సన్నివేశాన్ని చూస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
Sorry, no posts matched your criteria.