India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడినంత స్టాకు సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖామంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఎరువుల పరిస్థితి, పంటల స్థితిగతులను వారికి కలెక్టర్ వివరించారు.
కాలువలు, చెరువు గట్లపై ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి “వాచ్ డాగ్” కమిటీ సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 361.86 ఎకరాల ఆక్రమణలపై పరిశీలించి, వాటిని తొలగించే దిశగా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
జిల్లాలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనపై అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనకు సంబంధించిన మూడు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. నర్సాపురంలోని వశిష్ఠ గోదావరి నది ఒడ్డున ఘన వ్యర్థాలను పారేయడంపై సమీక్షించారు.
మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి స్పేస్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పర్యావరణ అనుకూల వినాయక చవితి అవగాహన కార్యక్రమంకు సంబంధించిన గోడపత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.
చిన్ననాటి వినాయక చవితి వేడుకలు మధుర జ్ఞాపకాలు.10 రోజుల ముందు నుంచే హడావిడి ఉండేది. వీధుల్లో పెద్ద పందిళ్లు మైకుల్లో పాటల హోరు.. ఆ సందడే వేరు. ఉదయం పూజలు, రాత్రికి స్నేహితులతో కలిసి తిరుగుతూ రకరకాల బొమ్మలు చూస్తూ, ప్రసాదాలను ఆస్వాదిస్తూ, ఆడిపాడిన ఆ రోజులు ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ అనుభూతులు ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో సజీవంగా ఉన్నాయి. ఆ పాత రోజులలోని జ్ఞాపకాలు మీకు గుర్తున్నాయా? COMMENT చేయండి.
చిన్ననాటి వినాయక చవితి వేడుకలు మధుర జ్ఞాపకాలు.10 రోజుల ముందు నుంచే హడావిడి ఉండేది. వీధుల్లో పెద్ద పందిళ్లు మైకుల్లో పాటల హోరు.. ఆ సందడే వేరు. ఉదయం పూజలు, రాత్రికి స్నేహితులతో కలిసి తిరుగుతూ రకరకాల బొమ్మలు చూస్తూ, ప్రసాదాలను ఆస్వాదిస్తూ, ఆడిపాడిన ఆ రోజులు ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ అనుభూతులు ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో సజీవంగా ఉన్నాయి. ఆ పాత రోజులలో జ్ఞాపకాలు మీకు గుర్తున్నాయా? COMMENT చేయండి.
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరుతో వశిష్ఠ గోదావరి నది ప్రవాహం పెరిగింది. నరసాపురం గోదావరినది ఉదృతంగా ప్రవహించడంతో నదిపై రాకపోకలు నిలిపేశారు. దీంతో పడవలు, ఫెర్రీలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు తహశీల్దార్ సత్యనారాయణ గోదావరి నదీ తీరాన్ని పరిశీలించారు. ఫెర్రీ రేవు నిర్వహకులతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో నదిపై రాకపోకలు నిర్వహించరాదని ఆదేశించారు.
తాడేపల్లిగూడెం మండలం అలంపురంలోని ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హాస్పిటల్‌ను కలెక్టర్ నాగరాణి గురువారం సందర్శించారు. హాస్పిటల్ ద్వారా రోగులకు అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వివిధ విభాగాలను, వైద్య పరికరాలను పరిశీలించి ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. హాస్పిటల్‌ను కొనుగోలు చేసిన నాలుగు ఎకరాల విస్తీర్ణాన్ని పరిశీలించారు.
జిల్లా పంచాయతీ అధికారి రాంనాథ్ రెడ్డి గురువారం ఆకివీడు మండలంలో పర్యటించారు. సిద్దాపురం, తరటావా, ఐ.భీమవరం, మందపాడు గ్రామాలలో పారిశుధ్య పనులను పరిశీలించారు. తరటావాలోని తాగునీటి చెరువుకు క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. సుమిత్ర సర్వే పురోగతిని సమీక్షించి, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ పరిశీలనలో అనర్హులుగా నోటీసులు అందుకున్న వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్ తెలిపారు. అనర్హులుగా గుర్తించిన 1904 మంది దివ్యాంగులలో, 1289 మందిని వృద్ధాప్య పెన్షన్లుగా మార్చినట్లు ఆయన పేర్కొన్నారు. పెన్షన్ రద్దయిన వారు నోటీసుతో పాటు సదరం సర్టిఫికెట్‌ను సమర్పించి పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.