India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాకిస్థాన్‌కు చిక్కుకున్న మన దేశ జాలర్లను 2024 నవంబర్‌లో భారత నేవీ సిబ్బంది సాహసోపేతంగా రక్షించిన విషయం తెలిసిందే. ఆ నేవీ దళంలో కడప జిల్లా కలశపాడు మండలం కొండపేటకు చెందిన పాలకొలను నారాయణరెడ్డి, వీరమ్మ కుమారుడు రమణారెడ్డి ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా CGC(Conspicuous Gallantry Cross) మెడల్ అందించాలని ఆదేశించారు.
దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 19వ తేదీ నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు TTD వెల్లడించింది. ఆలయ జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. 6నెలల పాటు బాలాలయంలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 18, 19న టీటీడీ అర్చకులు హోమాల చేస్తారు. 19వ తేదీ నుంచి బాలాలయంలో శ్రీవారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయి.
ప్రొద్దుటూరులో స్త్రీ శక్తి పథకం కింద RTC బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ ఐడీ కార్డు, లేదా డిజిటల్ కాపీ మాత్రమే చెల్లుబాటు అవుతుందని ప్రొద్దుటూరు RTC డిపో మేనేజర్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఫొటోస్టాట్ పేపర్లు, సెల్ ఫోన్‌లో ఫోటో తీసుకున్న చిత్రాలను అనుమతించరని ఆయన తెలిపారు. ఈ మేరకు మహిళా ప్రయాణికులు RTC కండక్టర్లు, సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కడప నగరంలో నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మంత్రి ఫరూక్ హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై తన సందేశంలో ప్రజలకు వినిపించారు.
స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కడప నగరంలో నిర్వహించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మంత్రి ఫరూక్ హాజరై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై తన సందేశంలో ప్రజలకు వినిపించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శ్రీధర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం జాతీయ జెండా ఎగురవేసి అధికారులకు సిబ్బందికి ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితంతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు.
బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లెకు చెందిన దేవరకొండ నరసయ్య యాదవ్ (42) స్కూటర్‌పై వెళ్తూ ఎడ్ల బండిని ఢీకొట్టాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అదే గ్రామానికి చెందిన సోమిరెడ్డి పల్లె నరసయ్య ఎడ్ల బండిపై పొలం వెళ్తుండగా నరసయ్య యాదవ్ స్కూటర్‌పై వేగంగా వెళ్తూ బండిని ఢీ కొట్టాడు. చికిత్స నిమిత్తం పొద్దుటూరుకి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.
ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా కడపలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అశోక్ కుమార్ సారథ్యంలో దాదాపు 500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల వరకు బయటి వ్యక్తులను అనుమతించడం లేదు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పులివెందుల ZPTC ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం రీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు.
అచివెల్లి(3): 33.74 శాతం.
మొత్తం ఓట్లు 492 కాగా.. ఇప్పటి వరకు 166 ఓట్లు పోలయ్యాయి.
E. కొత్తపల్లి (14): 26.71 శాతం.
మొత్తం ఓట్లు కాగా 1,273 ఓట్లు కాగా.. ఇప్పటి వరకు 340 ఓట్లు పోలయ్యాయి.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం రీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఉదయం 10 గంటలకు పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు.
అచ్చివెళ్లి(3): 6.71 శాతం.
మొత్తం ఓట్లు 492 కాగా.. ఇప్పటి వరకు 33 ఓట్లు పోలయ్యాయి.
E. కొత్తపల్లె(14): 11.47 శాతం.
మొత్తం ఓట్లు కాగా 1273 ఓట్లు కాగా.. ఇప్పటి వరకు 146 ఓట్లు పోలయ్యాయి.
Sorry, no posts matched your criteria.