Y.S.R. Cuddapah

News October 2, 2025

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏకు బెయిల్

image

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాకు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కడప పోలీసులు ఆయనను <<17897036>>అరెస్ట్<<>> చేశారు. ఈ క్రమంలో కోర్టులో ప్రవేశపెట్టగా ఖాజాకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది.

News October 2, 2025

వేముల : పెరిగిన చామంతి పూల ధరలు

image

ప్రస్తుతం మార్కెట్‌లో చామంతి ధరలు పెరిగాయి. బయట మార్కెట్లో కిలో చామంతి పూలు రూ. 70ల నుంచి రూ.80లు పలుకుతున్నాయి. చామంతి పూలను ఎక్కువగా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల మార్కెట్లకు తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం చామంతి ధరలు పడిపోయాయి. దసరా, దీపావళి పండుగలతోపాటు కార్తీకమాసం నేపథ్యంలో చామంతి ధరలు పెరిగాయి. దీంతో రైతులు తోటల వద్ద చామంతి పూలను కోసి మార్కెట్లకు తరలిస్తున్నారు.

News October 2, 2025

మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష పీఏ అరెస్ట్

image

మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష వ్యక్తిగత సహాయకుడు షేక్ ఖాజాను కడప వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫిర్యాదు మేరకు తనపై సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషణలతో ఉన్న వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణలతో ఆయనను హైదరాబాదులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున కడప నగర శివారులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకుని వచ్చారు. కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

News October 2, 2025

సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్‌గా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి

image

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) మెంబర్”గా నియమించారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గ వైసీపీ నేతలు ఎమ్మెల్సీకి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

News October 1, 2025

కలివి కోడి పేరు వెనక చరిత్ర ఇదీ..!

image

కడప జిల్లాలో కలివి కోడి అన్వేషణకు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సిద్ధవటం అటవీ ప్రాంతంలో దీనిని గుర్తించారు. పరిగెత్తడమే కానీ ఎగరటంరాని ఈ కోడికి పొదల్లో తప్ప, విడిగా రక్షణ ఉండదు. కలివి పొదల్లో ఎక్కువగా దాగి ఉండటంతో కలివి కోడి అని పిలుస్తుంటారు. పెన్నా నదీ తీరంలో కనిపించే ఈ కోడిపై మరిన్ని అధ్యయనాలు జరుగుతన్నాయి. ఇదే కోడి కోసం ఏకంగా తెలుగు గంగ ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మార్చారు.

News October 1, 2025

3న గండిక్షేత్రంలో బహిరంగ వేలం

image

గండిక్షేత్రంలో టెంకాయలు విక్రయాలకు సంబంధించి అక్టోబర్ 3వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, ఛైర్మన్ కావలి కృష్ణతేజ వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు రూ.10 లక్షల డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. ఆరోజు ఉదయం 10 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందన్నారు.

News October 1, 2025

కడప: 11 ఏళ్లు అయినా నల్లధనం ఏదీ?

image

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టిందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. మోదీ పీఎంగా అధికారం చేపట్టి 11 ఏళ్లు అవుతున్నా నేటికీ నల్లధనాన్ని వెలికి తీయలేదన్నారు. ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పారు. సీఎం చంద్రబాబు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు.

News September 30, 2025

కడప: ప్రియుడి కోసం విషం తాగిన యువతి

image

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఇది. బాధితురాలి వివరాల మేరకు.. పోరుమామిళ్ల మండలం ఈదులపల్లికి చెందిన లక్కినేని దేవరాజ్‌ను ఓ యువతి ప్రేమించింది. అతను పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం జరగలేదంటూ పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు.

News September 30, 2025

కడప: 11 ఏళ్లు అయినా నల్లధనం ఏదీ?

image

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టిందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. మోదీ పీఎంగా అధికారం చేపట్టి 11 ఏళ్లు అవుతున్నా నేటికీ నల్లధనాన్ని వెలికి తీయలేదన్నారు. ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పారు. సీఎం చంద్రబాబు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు.

News September 30, 2025

పులివెందులలో నవ వధువు ఆత్మహత్య

image

పులివెందుల పట్టణంలో విషాదం నెలకొంది. జయమ్మ కాలనీకి చెందిన నవ్యశ్రీ(19)కి ఇటీవలే వివాహమైంది. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉరి వేసుకుంది. స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.