Y.S.R. Cuddapah

News December 8, 2024

రాయచోటి ప్రశాంతంగా ఉండేందుకు సహకరించాలి: మంత్రి

image

రాయచోటి పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముస్లిం, హిందూ సోదరులు సోదర భావంతో ముందుకు వెళ్లాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రాయచోటిలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పట్టణంలో ఎవరైనా ప్రజలను రెచ్చగొట్టిన అల్లర్లకు పాల్పడినా, ప్రేరేపించినా ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 7, 2024

కడపలో Pic Of The Day

image

పేరెంట్- టీచర్స్ మీటింగ్‌లో పాల్గొనేందుకు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పోలీస్ సెక్యూరిటీ స్నిఫర్ డాగ్ ‘లూసి’ గౌరవ వందనం చేసింది. ఆయన దానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఆకట్టుకుంటోంది. కాగా ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రావీణ్యం పొందింది.

News December 7, 2024

కడప జిల్లాలో వరుస హత్యలు

image

కడప జిల్లాలో వారం వ్యవధిలో 4 హత్యలు జరిగాయి. నవంబర్ 30వతేదీన పులివెందులలో కొడుకును తండ్రి హత మార్చాడు. డిసెంబర్ 2న ప్రొద్దుటూరులో రౌడీషీటర్, అదే రోజు దువ్వూరులో మద్యానికి బానిసై వేధిస్తున్న కుమారుడిని తండ్రి రోకలిబండతో చంపాడు. నిన్న చక్రాయపేట మండలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరు కన్నుమూశారు. ఈ వరస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

News December 7, 2024

పెండ్లిమర్రి: గోపరాజుపల్లిలో ఇరువర్గాల దాడి

image

ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన పెండ్లిమర్రి మండలంలోని గోపరాజుపల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే ఇరువర్గాల మధ్య గొడవ జరిగి నంద్యాల సుబ్బయ్య అనే యువకుడి మీద దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గొడవకు పాతకక్షలే కారణమని వారు తెలిపారు.

News December 7, 2024

కడప: ఆకతాయిలకు ఎస్పీ హెచ్చరికలు

image

సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. 5వ తేదీ గురువారం రోజు రాత్రి రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాన్ని కొందరు ఆకతాయిలు వాట్సాప్ గ్రూప్‌లలో, సోషల్ మీడియాలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 7, 2024

నేడు కడపకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే.!

image

నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఉయదం 9:5కి బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో బయలుదేరి 10:15కి కడప ఎయిర్‌కి వస్తారు. అక్కడినుంచి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక 1:25కి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని 2:15కి బేగంపేటలో దిగుతారు.

News December 6, 2024

కడప: ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు.. కానీ.!

image

రోడ్డు ప్రమాదం జరిగితే 108 వాహనం రయ్ రయ్ మంటూ వచ్చి వారిని త్వరగా ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ.. గురువారం గువ్వలచెరువు ఘాట్‌లో బ్రహ్మంగారి మఠానికి చెందిన 108 డ్రైవర్ రమేశ్ మృతి చెందాడు. ఆయన మృతిని చూసిన వారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మందిని రక్షించిన వ్యక్తి ఇవాళ అదే రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

News December 6, 2024

పుష్ప-2 రీసెర్చర్‌గా కడప జిల్లా వాసి

image

పుష్ప-2లో కడప జిల్లా వాసి కీలక పాత్ర పోషించారు. జిల్లాకు చెందిన వీరా కోగటం జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఈక్రమంలో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ డైరెక్టర్‌ సుకుమార్‌ను కలిశారు. ఆ పరిచయంతో పుష్ప-2 ప్రాజెక్టులో చేరారు. ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. స్ర్కిప్ట్ కల్చర్, రీసెర్చర్‌గానూ వ్యవహరించారు. ఆయన భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

News December 6, 2024

కడప: ‘రెవెన్యూ సదస్సులు విజయవంతం చేయాలి’

image

జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రజాప్రతినిధులతో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రజలు, రైతుల భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు అన్నింటికీ పరిష్కార మార్గం చూపడానికి ఈనెల 6వ తేదీ నుంచి వచ్చేనెల జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు.

News December 5, 2024

7న కడపకు రానున్న డిప్యూటీ CM పవన్ కళ్యాణ్

image

ఈనెల 7వ తేదీన కడపకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొని ఆయన నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొని తిరిగి హైదరాబాదుకు చేరుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు.